
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో సరికొత్త ప్రేమాయణం.. నాగార్జునకే మైండ్ బ్లాక్ అవుతుందిగా..!
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లతో సాగుతుంది. ముఖ్యంగా ఎలిమినేషన్ సమయంలో ప్రతి ఒక్కరు చాలా టెన్షన్‌కి గురవుతున్నారు.ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది. ఏడో వారం అనూహ్యంగా మణికంఠ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. మణికంఠ ఎలిమినేషన్ ఫెయిర్ గా జరిగిందా లేదా అనే విషయంలో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకుంటే ఈ వారం ఓటింగ్ లో మణికంఠ ముందున్నాడు. అందరికంటే టేస్టీ తేజ ఓటింగ్ లో వెనుకబడి ఉన్నాడు. దాంతో ఈ వారం టేస్టీ తేజ్ ఎలిమినేట్ అవుతాడని అంతా అనుకున్నారు. కాని బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చి. మణికంఠను బయటకు పంపించినట్టు తెలుస్తోంది.
అయితే శనివారం జరిగిన ఎపిసోడ చూస్తే.. ఇందులో నాగార్జున కంటెస్టెంట్స్‌తో కలిసి కాస్త సందడి చేసాడు. అయితే హౌజ్‌లో లవ్ ఎఫైర్స్ అనేవి మొదటి సీజన్ నుండి వస్తున్నాయి. ఈ సారి విష్ణుప్రియ-పృథ్వీ మధ్య లవ్ స్టోరీ నడుస్తుందని అందరు అనుకున్నారు. అది చూసి చూసి ఆడియన్స్‌కి కూడా బోర్ కొట్టేసింది. దీంతో కొత్త స్టోరీకి తెరలేపారు.. తాజాగా హౌస్ లో మరో లవ్ స్టోరీ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం హౌస్ లో మెగాచీఫ్ గా కొనసాగుతున్న గౌతమ్.. యష్మీతో ఒంటరిగా మాట్లాడాడు. నేను సింగిల్.. నా వయసు 28. నాకు కూడా ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి.. అయితే గేమ్ వేరు, ఫ్రెండ్‌షిప్ వేరు అన్నట్లుగానే నేను చూస్తా.. అందుకే స్ట్రెయిట్‌గా చెప్పేస్తున్నా. నాకు నీ మీద లైకింగ్ ఉంది.. కొంచెం క్రష్ అలా అనుకో.. ప్రస్తుతం అది ఆ స్టేజ్‌లోనే ఉంది ఇక అది ముందుకెళ్తుందో లేదో నీ చేతుల్లోనే ఉంది అనేసి గౌతమ్ యష్మికి ప్రపోజ్ చేస్తాడు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో సరికొత్త ప్రేమాయణం.. నాగార్జునకే మైండ్ బ్లాక్ అవుతుందిగా..!
అప్పుడు యష్మి మాత్రం ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ సిగ్గుపడుతూ గౌతమ్‌ని చూస్తుంది. నేను ఫ్లర్ట్ చేస్తున్నా.. చేస్తా కూడా.. అలా అని చెప్పి నేను ఏం ఫోర్స్ చేయను.. నీ ఇష్టం అంటూ గౌతమ్ తన మనసులో మాట చెప్పేశాడు. ఇక యష్మీ నువ్వు నీలానే ఉండు.. నాకు నువ్వు చేసేది ఏమైనా డిస్ట్రబ్‌గా అనిపిస్తే నేను చెబుతా.. కానీ ఇప్పటివరకూ అలా ఏం అనిపించలేదు.. కానీ ఒక ఫ్రెండ్‌గా అయితే ఉంటా.. అంటూ యష్మీ చెప్పింది. ఇక ఆ తర్వాత ఇదే విషయాన్ని యష్మీ.. పృథ్వీతో డిస్కస్ చేసింది. రేయ్ గౌతమ్ నాతో మాట్లాడాడు అంటూ యష్మీ చెప్పగా అవును ఉదయం నుంచి మాట్లాడుతున్నాడుగా అంటూ విష్ణు డైలాగ్ వేసింది. అయితే యష్మీ మనసులో నిఖిల్ ఉన్నట్లు బయటకు చెప్పేసింది. ఓసారి టాస్క్‌లో గెలిచినందుకు నిఖిల్‌కి ముద్దు కూడా పెట్టేసింది యష్మి. మరి గౌతమ్‌తో లవ్ ట్రాక్ ఎలా నడుస్తుంది. మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవుతుందా అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు.
Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ Pan India…
LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…
Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…
Heart Attack : ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
This website uses cookies.