Home » Entertainment » Trisha Birthday Wishes By Charmi
Entertainment

Trisha : త్రిషకు షాకింగ్ బర్త్ డే విషేస్.. స్టార్ హీరోయిన్ ట్వీట్ ఎంత వైరల్ అవుతుందో తెలుసా..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: May 4, 2021 10:15 pm
Advertisement

Trisha : త్రిష .. సౌత్ స్టార్ హీరోయిన్. ఈ రోజు ఈ బ్యూటీ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు సౌత్ అండ్ నార్త్ స్టార్ హీరోలు.. హీరోయిన్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు కావస్తున్న త్రిష కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నాయి. అటు తమిళం, ఇటు తెలుగు భాషలతో పాటు మిగతా సౌత్ భాషల్లోనూ త్రిష నటించి బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంది. క్రేజీ హీరోయిన్‌గా త్రిష చాలా లాంగ్ టైం ఇండస్ట్రీలో కొనసాగింది.

Advertisement

trisha-shocking birthday wishes by charmi

ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అయితే తమిళంలో విజయ్ సేతుపతి తో కలిసి నటించిన 96 సినిమాతో సూపర్ హిట్ అందుకొని మళ్ళీ మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా హిట్ తర్వాత తమిళం మలయళ భాషలలో దాదాపు ఆరు సినిమాలు చేస్తోంది. అందులో స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా పొన్నియన్ సెల్వన్ కూడా ఉండటం విశేషం. ఈ సినిమా త్రిష కెరీర్ లో గొప్ప సినిమాగా మిగిలిపోతుందని చాలా నమ్మకంగా ఉంది. అయితే మే 4న త్రిష బర్త్ డే కావడంతో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ..ప్రస్తుతం నిర్మాత ఛార్మీ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.

Advertisement

Trisha : త్రిష త్వరలో పెళ్ళి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి.

ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. హ్యాపీయెస్ట్ బర్త్ డే త్రిష. నాకు ఇదే నీ లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే అని బలంగా అన్పిస్తోంది.. అంటూ షాకింగ్‌గా విషెస్ తెలిపింది. అందుకు కారణం గత కొన్ని రోజులుగా త్రిష త్వరలో పెళ్ళి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. అందుకే ఛార్మీ ఇలా ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుండటంతో పాటు త్వరలో త్రిష పెళ్ళి అని వస్తున్న వార్తలకు బలం చేకూర్చింది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి