
trolls on sarkaaru vaari pata first single kalavathi
Sarkaaru Vaari Pata : మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందిన సర్కారు వారి పాట సినిమా నుండి మొదటి పాటను తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. వాలంటైన్స్ డే రోజే విడుదల అవ్వాల్సిన ఈ పాటని లీక్ అవ్వడం తో ముందు రోజే విడుదల చేశారు. పాటకు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. రికార్డు స్థాయిలో యూట్యూబ్ లైక్ కట్టబెట్టి మహేష్ పై అభిమానం ను చాటుకుంటున్నారు. కళావతి అంటూ వచ్చిన ఈ పాటపై కొందరు సినీ ప్రముఖులు మరియు విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ ఈ పాటలోని ముఖ్యమైన లిరిక్స్ ని నాశనం చేశాడు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సిద్ద్ శ్రీరామ్ తో ఈ పాటను పాడించడం కారణంగా మొత్తం లిరిక్స్ అన్నీ కూడా గాయబ్ అయ్యాయి. ఉన్న లిరిక్స్ ఒకటైతే ఆయన పాడింది ఒకలా అనిపిస్తుంది. లిరిక్స్ చదువుతున్నప్పుడు.. ఆయన పాడిన పాట వింటున్నప్పుడు ఇదేంటి ఇలా ఉంది అనే అనుమానం కలుగుతుంది. కాస్త పద్దతిగా సిద్ద్ శ్రీరామ్ తో పాడించి ఉండాల్సింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలాంటి పాటలకు అతడి వాయిస్ సెట్టు అవుతుందేమో కానీ.. అతడి తెలుగు భాష సెట్ అవ్వదు. అతడు పాడితే సక్సెస్ అంటూ ట్రెండ్ మొదలైంది అందుకే అతడితో వరుసగా పాటలు పాడించి ఎందుకు సంగీత దర్శకులు మరియు హీరోలు ఆసక్తి చూపుతున్నారు. కానీ అతను పాడడం వల్ల లిరిక్స్ నాశనమవుతున్నాయి.. పాట చనిపోతుంది అంటూ కొందరు సాహిత్యవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
trolls on sarkaaru vaari pata first single kalavathi
అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట లిరిక్స్ వింటూ ఉంటే వెంటనే అర్థం కావడం లేదు.. కాని చదువుతూ ఉంటే భలే రాశాడు అంటూ అనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. అనంత శ్రీరామ్ రాసిన మంచి సాహిత్యాన్ని సిద్ద్ శ్రీరామ్ చేతిలో పెట్టడం వల్ల నాశనం అయింది అంటూ ఆవేదన వ్యక్తమవుతోంది. ముందు ముందు అయినా మంచి ఎంపిక చేసుకోవాలని సంగీత దర్శకుడు థమన్ కు అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలుగు రాని వ్యక్తి తో తెలుగు పాట పాడించడం వల్ల తెలుగు నాశనమవడం తప్పితే ఏమీ లేదు. అందుకని ఇంక ముందు అయినా కాస్త జాగ్రత్తగా ఉండడం బెటర్ థమన్ అంటున్నారు. సర్కారు వారి పాట సినిమా ను వచ్చే నెలలో విడుదల కు సిద్దం చేశారు. మహేష్ బాబు ఈ పాటలో కీర్తి సురేష్ కంటే అందంగా కనిపిస్తున్నాడంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.