టక్ జగదీష్ .. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా. గతంలో నాని కి నిన్నుకోరి వంటి సూపర్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ తెరకెక్కుతోంది. నాని నటిస్తున్న 26వ సినిమాగా తెరకెక్కుతున్న టక్ జగదీష్ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీతూ వర్మ – ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం.
ఈ పోస్టర్ నాని ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాని ఈ పోస్టర్ చూస్తుంటే మళ్ళీ నాని మరోసారి ప్రయోగం చేస్తున్నాడని టాక్ మొదలైంది. అంతేకాదు నిజంగా టక్ జగదీష్ తో నాని చేసేది ప్రయోగమే అయితే మాత్రం ఎలా ఉంటుందో అని మాట్లాడుకుంటున్నారట. నాని కి గత కొంతకాలంగా ప్రయోగాలు వికటిస్తున్నాయి. నాని గత చిత్రం వి కూడా ఒక ప్రయోగమే. అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సస్ ని సాధించలేదు. నాని కంటే వి సినిమా సుధీర్ బాబు కే ఎక్కువగా కలిసి వచ్చింది. మళ్ళీ అదే ఇప్పుడు టక్ జగదీష్ సినిమాతో రిపీటవుందా అని చెప్పుకుంటున్నారట.
అయితే ఇప్పటి వరకు దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన నిన్నుకోరి, మజిలీ సినిమాలు ఊహించని రేంజ్ లో సక్సస్ ని సాధించాయి. కాబట్టి టక్ జగదీష్ గ్యారెంటీగా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సస్ ని సాధిస్తుందని ఫ్యాన్స్ చాలా ధీమాగా ఉన్నారు. మొత్తానికి నాని టక్ జగదీష్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకొని ఫుల్ ఫాం లోకి వచ్చేస్తాడని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాదు ఇటీవలే శ్యాం సింగ్ రాయ్ అన్న సినిమా కూడా సెట్స్ మీదకి వచ్చింది. వచ్చే ఏడాది టక్ జగదీష్ తో పాటు శ్యాం సింగ్ రాయ్ రిలీజ్ చేయాలని చూస్తున్నాడు నాని.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.