
TV5 Murthi : వేణు స్వామి బండారం బయటపెట్టిన టీవీ5 మూర్తి..!
TV5 Murthi ; టీవీ 5 మూర్తి. తెలుగు మీడియా ని ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు. సామాన్య స్థాయి నుంచి నేడు పేరు మోసిన జర్నలిస్ట్ అయినటువంటి ఆయన టీవీ చర్చా కార్యక్రమంలో యమహేమిలైన వారిని కుడా తన వాడి వేడి ప్రశ్నలతో చెడుగుడు ఆడుకుంటూ ఉంటారు. అయితే మూర్తి గారి ఈ దూకుడు కొన్నిసార్లు ఇబ్బంది పెట్టింది.ఇందులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సినీ నటీనటునులు కౌశల్ ముందా శ్రీ రెడ్డి తో కూడా ఈయనకు వివాదాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వీటి వెనక అసలు ఏం జరిగింది అనే విషయాలను మూర్తి పంచుకున్నారు.
మరి ముఖ్యంగా వేణు స్వామి ప్రధాని నరేంద్ర మోడీతో దిగిన ఫోటో అప్పట్లో ఎంత వైరల్ అయిందో అందరికి తెలుసు. ప్రముఖుల యొక్క జాతకాలు చెబుతూ అప్పటికే ఫేమస్ అయిన వేణు స్వామి మోడీతో దిగిన ఫోటో ఆయనకు మరింత ఇమేజ్ తెచ్చిపెట్టింది.ఆ తర్వాత సీనియర్ రాజకీయ నాయకులు వేణు స్వామి దగ్గరికి క్యూ కట్టినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ ఫోటో మీద అనుమానం వచ్చి ఆ ఫోటో నిజమా ఫేక్ నా అని నిరూపించడానికి మూర్తి డిసైడ్ అయినట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో తన స్నేహితులతో కలిసి సమాచార హక్కు చట్టం ద్వారా మోదీని వేణు స్వామి కలిసారా ఫోటో దిగారా అని వివరాలు తెలపాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేసినట్లుగా మూర్తి తెలియజేశారు. ఇక ఈ విషయం మీద స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం అలాంటిది ఏమీ లేదని సమాచారం ఇచ్చారట. ఆ తర్వాత ఆ ఫోటో ఎక్కడిది అని సాంకేతిక సాయంతో ఆరా తీయగా అది అస్సాం ముఖ్యమంత్రితో వేణు స్వామి దిగినట్లుగా మూర్తి పేర్కొన్నారు.
అయితే సీఎం ముఖాన్ని తీసేసి ఆ ఫేస్ లో మోడీ ఫోటోని పెట్టి మార్ఫింగ్ చేసినట్లుగా మూర్తి తెలిపారు. ఆ తర్వాత వేణు స్వామిని లైవ్ లోకి తీసుకొని ప్రశ్నించగా తాను కూడా కలవలేదని ఒప్పుకున్నారని మూర్తి పేర్కొన్నారు. అయితే ప్రధాని మోడీని ప్రచారానికి వాడుకుని తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని ఉద్దేశంతో ఆరోజు లైవ్ షో చేశానని మూర్తి వెల్లడించడం జరిగింది. ప్రధానమంత్రిని వేణు స్వామి కలిసారు అంటే దేశంలో ఉన్న రాజకీయ నాయకులు మొత్తం ఆయన దగ్గరకు పరిగెడతారు అని పీఎం ను ప్రచారానికి వాడడం కరెక్ట్ కాదని మూర్తి వెల్లడించారు.
TV5 Murthi : వేణు స్వామి బండారం బయటపెట్టిన టీవీ5 మూర్తి..!
అలాగే ఇంకో సంఘటనలో బిగ్ బాస్ లో పాల్గొన్నటువంటి కౌశల్ అభిమానులు కౌశల్ ఆర్మీ పేరిట చేసినటువంటి హడావిడిని కూడా తాను ఎండగట్టినట్లుగా చెప్పారు. బిగ్ బాస్ లో ఉన్నటువంటి మిగతా కంటెస్టెంట్లు వారి కుటుంబ సభ్యుల్ని కూడా చాలా రకాలు వేధించారని మూర్తి గుర్తు చేశారు. బిగ్ బాస్ విన్ అయినందుకు ప్రధానమంత్రి స్వయంగా అభినందించారుని కౌశల్ చెప్పుకునేవారని దీంతో లైవ్ లో కౌశల్ ని ప్రశ్నించానని చెప్పారు. ఏ నెంబర్ నుండి ఫోన్ వచ్చిందో తెలుసుకొని కాల్ చేయగా అవతలి వ్యక్తి తెలుగు వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశారట. అయితే అతను కూడా జర్నలిస్ట్ అని ఢిల్లీ ఏపీ భవన్ లో పనిచేశారని చెప్పిన మూర్తి దీని గురించి ఎక్సప్లయిన్ చేశారు. అయితే ఈ నిజాన్ని లైవ్లో బయటపెడితే కౌశల్ ఆర్మీ తనని టార్గెట్ చేస్తారు కాని తాను దేనికి భయపడే వ్యక్తిని కాదని టీవీ5 మూర్తి రీసెంట్ గా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.