unstoppable season 2 next guest details are viral
Unstoppable 2 : అన్ స్టాపబుల్ షో గురించి తెలుసు కదా. అన్ స్టాపబుల్ సీజన్ వన్ సూపర్ సక్సెస్ అయిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా అన్ స్టాపబుల్ షో 2ను కూడా ఆహా యాజమాన్యం స్టార్ట్ చేసింది. ఇప్పటికే 8 ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ఇటీవల ప్రసారం అయిన ప్రభాస్ ఎపిసోడ్ చూడటం కోసం జనాలు ఎగబడ్డారు. చివరకు ఆహా సర్వరే క్రాష్ అయింది అంటే.. ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ హోస్ట్ బాలకృష్ణ కావడంతో ఆ షోకు మరింత హైప్ వచ్చింది.
బాలకృష్ణ… గెస్టులను ప్రశ్నలు అడిగే తీరు.. వ్యక్తిగత విషయాలను కూడా అడిగి.. ఇబ్బంది పెట్టి మరీ ఆ గెస్ట్ కు చెమటలు పట్టించేంత కెపాసిటీ బాలయ్యకు ఉంది. నిజానికి.. ఆ గెస్ట్ ఎంత పెద్దవారు అయినా సరే.. బాలయ్య ముందు బలాదూర్ అవ్వాల్సిందే. అందుకే ఆ షోకు అంత క్రేజ్ వస్తోంది. అందుకే ప్రభాస్ కూడా బాలయ్య అడిగే ప్రశ్నలకు కొన్నిసార్లు బిక్కమొహం వేయాల్సి వచ్చింది. అయితే.. ఈ షోకు తొలి సీజన్ లోనే గెస్ట్ గా తీసుకురావాలనుకున్నప్పటికీ కుదరలేదట.
unstoppable season 2 next guest details are viral
అందుకే రెండో సీజన్ కు ఏకంగా సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ ను ఈ షోకు గెస్ట్ గా పిలవనున్నారట. నిజానికి.. కేటీఆర్ తెలంగాణకు కాబోయే సీఎం అంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. మంత్రి కేటీఆర్ ను ఈ షోకు గెస్ట్ గా పిలిచారట. అయితే.. కేవలం ఒక్క కేటీఆర్ మాత్రమే కాదు.. ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ ను కూడా ఆయనతో పాటు గెస్ట్ గా ఆహ్వానించారట. ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. కానీ.. మంత్రి కేటీఆర్ డేట్స్ కొద్దిగా అడ్జస్ట్ అవ్వడం లేదట. మరి.. కేటీఆర్ డేట్స్ అడ్జస్ట్ అయితే ఇక రామ్ చరణ్, కేటీఆర్ ఇద్దరితో కలిసి బాలయ్య మాటామంతి ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
This website uses cookies.