Upasana Kamineni : ఉపాసన కామినేని డెలివరీ డేట్ వచ్చేసింది !
Upasana Kamineni : ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఒకటే ట్రెండింగ్ టాపిక్ ఒకటే. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని డెలివరీ గురించి. తను గర్భం దాల్చినట్టు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. వాళ్ల పెళ్లి అయిన 10 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చడంతో మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొన్నది. ఇక.. అప్పటి నుంచి ఉపాసనకు సంబంధించి ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా చాలా ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఉపాసనకు ఏడో నెల.
upasana kamineni delivery date announced
ఇంకో రెండు నెలల్లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో మెగా వారసుడి కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇటీవలే చిరంజీవి ఇంట్లో ఉపాసన సీమంతపు వేడుకను నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే.. ఉపాసన తన డెలివరీ డేట్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను తన అభిమానులతో షేర్ చేసుకుంది. తనకు జులై నెలలో డెలివరీ డేట్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది ఉపాసన.
Ram Charan and Upasana say good news
Upasana Kamineni : పుట్టబోయే బిడ్డ కోసం షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్
తను జులైలో బిడ్డను జన్మనివ్వబోతున్నానని.. తమ బిడ్డ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారని తెలిపింది ఉపాసన. అలాగే.. రామ్ చరణ్ కూడా తనకు పుట్టబోయే వారసుడి కోసం తన షూటింగ్స్ కు కూడా బ్రేక్ ఇచ్చాడు. తనకు సమయం దొరికినప్పుడల్లా తన భార్య ఉపాసనకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు రామ్ చరణ్. అలాగే.. పుట్టబోయే బిడ్డ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఉపాసన చెప్పుకొచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా తన వృత్తిపరమైన విషయాల్లో ముందు వెళ్తానని, ఓవైపు బిడ్డ ఆలనా పాలనా కూడా చూసుకుంటానని ఉపాసన చెప్పుకొచ్చింది. ఇక జులైలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వబోతుందనే వార్త మెగా ఫ్యాన్స్ కు తెలియడంతో ఇప్పటి నుంచే సంబురాలు చేసుకుంటున్నారు.
