Home » Entertainment » Upasana Konidela Clears On Surrogacy Rumours
Entertainment

Upasana Konidela : తొలిసారి బేబి బంప్‌తో క‌నిపించిన ఉపాస‌న‌.. స‌రోగ‌సి రూమ‌ర్స్ కి చెక్ ప‌డ్డట్టేనా..?

Authored By
Sam C
The Telugu News | Published on: December 19, 2022, 7:30 pm
Advertisement

Upasana Konidela : సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల‌కు సంబంధించిన వార్త‌ల‌కు అవ‌ధులే ఉండ‌వు. కొంద‌రు పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే మ‌రి కొంద‌రు నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. గ‌త కొద్ది రోజులుగా ఉపాస‌నకి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అందుకు కార‌ణం టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు కాబోతున్నారు అంటూ ఇటీవల చిరంజీవి ప్రకటించ‌డ‌మే. పెళ్లి అయిన పదేళ్ల తరువాత రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు తల్లిదండ్రులు అవుతుండడంతో.. ఈ స్టార్ కపుల్ సహజ పద్దతిలో కాకుండా సరోగసి ద్వారా పిల్లలని కనబోతున్నారు అంటూ అనేక క‌థ‌నాలు పుట్టుకొస్తున్నాయి.

Advertisement

ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు రాయడం, ఏవేవో క‌థ‌లు అల్లేయ‌డంతో మెగా ఫ్యాన్స్ ఆలోచన‌లో ప‌డ్డారు. అయితే ఈ వార్తలన్నింటికి ఉపాస‌న ఒక్క ఫోటోతో చెక్ పెట్టేసింది అని చెప్పాలి. ఫ్యామిలీ పార్టీ ఉండడం వల్ల చరణ్ అండ్ ఉపాసన ఇటీవల థాయ్‌లాండ్‌కు వెళ్లిన‌ట్టు తెలుస్తుండాగా, అక్కడ ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న తమ ఇద్దరి ఫోటోలను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫొటోలో ఉపాసన బేబీ బంప్‌తో కనిపిస్తుండ‌గా, ఇన్నాళ్లు ఆమె సరోగసి వార్తలపై వ‌చ్చిన వార్త‌లకు చెక్ ప‌డ్డ‌ట్టు అయింది. ఆమె నేరుగా స్పందించక పోయినా, ఇన్ డైరెక్ట్‌గా ఇలా ఆ వార్తలకి చెక్ పెట్టినట్లు అయ్యింది.

Upasana Konidela clears on Surrogacy Rumours

Advertisement

Upasana Konidela : పుకార్ల‌కి చెక్

వాస్తవానికి నయనతార తల్లి అయినట్లు ప్రకటించిన సమయంలోనే ఈ విషయం మీద ఎంత‌ పెద్ద ఎత్తున వివాదం చెలరేగిందో మ‌నం చూసాం. భారతదేశంలో సరోగసి చట్టం విషయంలో చాలా నిషేధాజ్ఞలు ఉన్నాయి, కాబట్టి రామ్ చరణ్ భార్య ఉపాసన ఆ విధంగా ముందుకు వెళుతుందా లేదా అనే విషయంపై చ‌ర్చ అయితే న‌డుస్తుంది. అయితే ఇప్పుడు ఆమె అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడం లేదనే విషయం దానిపై ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేసింది ఉపాస‌న‌. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న విష‌యం తెలిసిందే. . ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి