Home » News » Karthika Deepam 2 March 2nd 2026 Monday Episode Highlights
News

Karthika Deepam 2 March 2nd 2026 Episode : దీప కడుపుకోత.. అత్త కోసం కార్తీక్ పోరాటం.. సుమిత్ర ప్రాణాలు దక్కేనా?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: March 2, 2026, 8:30 am
Advertisement

Karthika Deepam 2 March 2nd 2026 Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’ సీరియల్ అత్యంత ఉత్కంఠభరితంగా, భావోద్వేగాల మధ్య సాగుతోంది. సోమవారం మార్చి 2 ఎపిసోడ్ ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా సాగింది. సుమిత్రను బతికించుకోవడానికి దీప తన కడుపులోని బిడ్డను త్యాగం చేయడానికి సిద్ధపడటం, ఈ విషయం తెలిసిన దశరథ కార్తీక్, దీపలపై విరుచుకుపడటం ఈ ఎపిసోడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అసలు నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో వివరంగా చూద్దాం.

Advertisement

Karthika Deepam 2 March 2nd 2026 Episode : దీప కడుపుకోత.. అత్త కోసం కార్తీక్ పోరాటం.. సుమిత్ర ప్రాణాలు దక్కేనా?

Karthika Deepam 2 March 2nd 2026 Episode మీరు ఇద్దరూ హంతకులే: కార్తీక్, దీపలపై దశరథ ఫైర్

సుమిత్రకు లివర్ దానం చేయడానికి దీప తన గర్భాన్ని తీసేయించుకోవాలని (అబార్షన్) నిర్ణయించుకున్న విషయం దశరథకు తెలుస్తుంది. దీంతో ఆయన కోపంతో ఊగిపోతాడు. డాక్టర్ దగ్గర ఉన్న కార్తీక్, దీపల వద్దకు వచ్చి విరుచుకుపడతాడు. “నా కూతురి కడుపులోని బిడ్డను చంపమని చెప్పడానికి అసలు నువ్వు ఎవరు?” అని కార్తీక్‌ను నిలదీస్తాడు దశరథ. దీప వైపు తిరిగి.. “పుట్టిన తర్వాత నిన్ను చంపాలనుకున్న పారిజాతం పిన్నికి, ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డను చంపుకోవాలనుకుంటున్న నీకు తేడా ఏంటి? నా దృష్టిలో మీరిద్దరూ హంతకులే” అని మండిపడతాడు. పిల్లల ప్రాణాలు కాపాడుకునే తల్లిదండ్రులను చూశాను కానీ, ఇలా బిడ్డను చంపుకునే వాళ్లను చూడలేదని తీవ్ర పదజాలంతో దూషిస్తాడు.

Advertisement

Karthika Deepam 2 March 2nd 2026 Episode అత్త చచ్చిపోయినా పర్లేదా మామయ్యా?: కార్తీక్ కౌంటర్

దశరథ మాటలకు కార్తీక్ తీవ్రంగా ఎమోషనల్ అవుతాడు. “నా భార్యను నేను బలవంతం చేసి బిడ్డను చంపుకునేలా చేస్తున్నానని అనుకుంటున్నావా మామయ్యా? నేనూ మనిషినే. నాకు కలలు ఉంటాయి. బిడ్డను చేతుల్లోకి తీసుకోవాలని నాకూ ఆశ ఉంటుంది. కానీ, నా అత్త ప్రాణాలు కాపాడటానికి వేరే దారి లేకనే నా బిడ్డను వదులుకుంటున్నాను” అని ఆవేదన వ్యక్తం చేస్తాడు. “కంటికి కనిపించని ప్రాణం మీద నీకు ఇంత మమకారం ఉంటే.. నీ కళ్లెదుటే ప్రాణాపాయంలో ఉన్న నీ భార్యను ఎందుకు వదిలేస్తున్నావు? అత్త చచ్చిపోయినా పర్లేదా? చెప్పు మామయ్యా” అని కార్తీక్ నిలదీయడంతో దశరథ షాక్ అవుతాడు. తన తల్లి ప్రాణాల కోసం దీప చేస్తున్న త్యాగానికి మనం ఆమె కాళ్లు మొక్కాలని కార్తీక్ అంటాడు.

కూతురి కాళ్లపై పడబోయిన కన్నతండ్రి

కార్తీక్ మాటలతో దశరథ కళ్లు తెరుచుకుంటాయి. తాను ఎంత తప్పుగా ఆలోచించాడో అర్థమవుతుంది. సుమిత్ర లేకుండా తాను బతకలేనని, అలాగని కూతురి బిడ్డను బలి తీసుకోలేనని ఏడుస్తాడు. “నువ్వు నా కన్న కూతురివా? కన్న తల్లివా? ఈ తండ్రి చేతకానితనం వల్ల ఇన్నేళ్లు కష్టాలు పడ్డావు.. ఇప్పుడు ఇంత పెద్ద భారం మోస్తున్నావు” అంటూ దీప కాళ్ల మీద పడబోతాడు. ఇద్దరినీ కాపాడుకునే మార్గం ఆలోచిద్దామని దశరథ అంటాడు. దానికి కార్తీక్ స్పందిస్తూ.. “ముందు నువ్వు ఇంటికెళ్లి అత్త పరిస్థితి చూడు, అప్పుడు నీకేం చేయాలో అర్థమవుతుంది” అని పంపిస్తాడు.

Advertisement

ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కార్తీక్

దశరథ వెళ్లిన తర్వాత కార్తీక్ డాక్టర్ హారిక వద్దకు వెళ్తాడు. దీపకు ఆపరేషన్ చేయడానికి ప్రొసీజర్ స్టార్ట్ చేయమని చెబుతాడు. డాక్టర్ టెన్షన్ పడుతూ.. “నిజం ఒక్కొక్కరికి తెలిసిపోతోంది, దశరథ గారు గొడవ చేయరు కదా, శివన్నారాయణ గారికి కూడా చెప్తారా?” అని అడుగుతుంది. మనం ముందేం ప్లాన్ చేసుకోలేదని, సమస్యకు పరిష్కారం వెతుకుతున్నామని కార్తీక్ వివరిస్తాడు. దీపను హాస్పిటల్‌లో అడ్మిట్ చేయమని డాక్టర్ సూచించడంతో కార్తీక్ సరేనంటాడు.

రక్తం కక్కుకుంటూ నరకయాతనలో సుమిత్ర

ఇంటికి వెళ్లిన దశరథకు గుండె పగిలే దృశ్యం కనిపిస్తుంది. సుమిత్ర రక్తం వాంతులు చేసుకుంటూ, దగ్గుతూ నరకయాతన అనుభవిస్తుంటుంది. “నేను బతుకుతానా? ఆపరేషన్ వరకు కూడా ప్రాణాలతో ఉంటానా? కళ్లు మూస్తే మళ్లీ తెరుస్తానో లేదో అని భయంగా ఉంది” అని సుమిత్ర భర్తతో తన బాధను పంచుకుంటుంది. అంత బాధలోనూ దీప కడుపులోని బిడ్డ క్షేమంగా ఉందా అని అడగడంతో అక్కడున్న దశరథ, ఆప్పుడే వచ్చిన కార్తీక్, దీప కంటతడి పెట్టుకుంటారు. వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయమని శివన్నారాయణ దశరథకు చెబుతాడు. కార్తీక్ అన్న మాటలు గుర్తొచ్చి దశరథ మౌనంగా రోదిస్తాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయి భాగంలో సుమిత్ర పరిస్థితి విషమించడంతో కార్తీక్, దీప ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? దీప అబార్షన్ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుందా? అనేది తదుపరి ఎపిసోడ్లలో ఉత్కంఠగా మారనుంది.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి