Home » Entertainment » Upasana Konidela Pregnancy News Viral
Entertainment

Upasana Konidela : మెగా కోడలు ఉపాసన ‘ ప్రెగ్నెన్సీ ‘ న్యూస్ వెనక బిగ్ బ్రేకింగ్ న్యూస్..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 3, 2023 11:14 am
Advertisement

Upasana Konidela : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2012లో వివాహమైంది. వీరి వివాహం జరిగి పదేళ్లు అవుతున్న వీరికి సంతానం కలగలేదు. ఇక ఇటీవల ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ మెగాస్టార్ చిరంజీవి అధికారిక ప్రకటన ఇచ్చారు. దీంతో అభిమానులు మెగా వారసుడు రాబోతున్నాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉపాసన డెలివరీ విషయంలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. చరణ్ , ఉపాసన ఫస్ట్ బేబీ బర్త్ అమెరికాలో ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల రామ్ చరణ్ అమెరికా గుడ్ మార్నింగ్ షో కి గెస్ట్ గా హాజరయ్యారు దీంతో ఈ వార్తలు నిజమే అని అందరూ అనుకున్నారు.

Advertisement

Upasana Konidela pregnancy news viral

ఈ షోలో డాక్టర్ అస్టిన్ సైతం పాల్గొన్నారు. జెన్ అస్టిన్ ఫిజీషియన్, ఏబిసి న్యూస్, గుడ్ మార్నింగ్ అమెరికా షో కి చీఫ్ మెడికల్ కరస్పాండెంట్. అలాగే డాక్టర్ ఓజ్ షోకి ఉమెన్స్ హెల్త్ కరస్పాండెంట్. ఈ క్రమంలో ఆమె ఆధ్వర్యంలో అమెరికాలో ఉపాసన డెలివరీ జరగనున్నని కథనాలు వెలువడ్డాయి. అయితే ఉపాసన ఈ వార్తలకు చెక్ పెట్టేసింది. మా మొదటి బిడ్డ ప్రసవం ఇండియా లో అపోలో హాస్పిటల్ లో జరుగుతుంది. డాక్టర్ సుమన, డాక్టర్ మనోహర్, డాక్టర్ రుమా సిన్హాలతో పాటు డాక్టర్ జెన్నిఫర్ ఆస్టిన్ జాయిన్ కానున్నారు. ఈ మూమెంట్ కోసం నేను

Advertisement

ఎంతగానో ఎదురుచూస్తున్నానని ఉపాసన వెల్లడించారు. ఉపాసన డెలివరీ కోసం డాక్టర్ అమెరికా నుంచి రాబోతున్నారని ఉపాసన పరోక్షంగా చెప్పారు. ఉపాసన అటు మెగా కోడలిగా, ఇటు అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ధనవంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ కష్టపడడం అలవర్చుకున్నట్లు ఉపాసన వెల్లడించారు. నేను పని చేయాల్సిన అవసరం లేదు కానీ కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేస్తున్నానని ఉపాసన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా రాంచరణ్ దంపతులు మెగా వారసుడు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి