Vadinamma 11 Nov Today Episode : అనాథాశ్రమంలో బాబును దత్తత తీసుకోవాలని రఘురామ్ కు చెప్పిన లక్కీ.. దీంతో అందరూ షాక్

Vadinamma 11 Nov Today Episode : వదినమ్మ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 నవంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 697 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వద్దు లక్కీ మనం మా అమ్మ వాళ్లింటికి వెళ్లిపోదాం. వద్దు.. ఇక్కడ ఉండొద్దు అంటుంది శైలూ. దీంతో శైలూను బుజ్జగిస్తాడు. రఘురామ్ అన్నయ్యను నిన్న నిలదీసి నేను పెద్ద తప్పు చేశాను. వద్దు.. చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకోవద్దు. ఏం కాదు.. కలిసే ఉందాం.. అంటాడు లక్కీ.

vadinamma 11 november 2021 full episode

ఉదయాన్నే రఘురామ్.. లక్ష్మణ్ అని పిలుస్తాడు. దీంతో శైలూ షాక్ అవుతుంది. బావ గారు.. బాబు కోసమే పిలుస్తున్నారు అంటుంది. కాదులే.. వేరే పని అయి ఉంటుందిలే అంటాడు లక్ష్మణ్. మరోవైపు లక్ష్మణ్.. లక్ష్మణ్ అని పిలిచినా పలకకపోయేసరికి.. ఏం చేస్తున్నావురా పలకవేంటి. రిషి ఎక్కడ ఒకసారి వాడిని తీసుకురా ఆడుకుంటాను అంటాడు రఘురామ్. దీంతో లక్ష్మణ్ షాక్ అవుతాడు. రిషి లేవలేదు అన్నయ్య. పడుకున్నాడు అంటాడు. రిషి లేవగానే తీసుకొచ్చి నేనే ఇస్తానులే అన్నయ్య అంటాడు లక్కీ.

ఇంతలో రిషి సౌండ్ వినిపిస్తుంది. దీంతో రఘురామ్ పైకి వస్తాడు. రిషిని చూసి ఖుషీ అవుతాడు. రిషి దగ్గరికి వెళ్లబోయేసరికి.. ఛీ..ఛీ..ఛీ.. సిగ్గు లేదరా నీకు.. పాయింట్ లో పోసేసుకున్నావు. పదా.. నీకు స్నానం చేయిస్తాను అని అంటుంది శైలూ. దీంతో రఘురామ్ బాధతో కిందికి వెళ్లిపోతాడు.

లక్కీ పైకి వెళ్లి బాధపడతాడు. మొదటిసారి అన్నయ్యకు అబద్ధం చెప్పాను.. అని శైలూతో అంటాడు లక్కీ. అన్నయ్య ముఖం ఎలా చూడాలి అని శైలూతో అంటాడు. నువ్వు అబద్ధం చెప్పలేదు.. చెప్పేలా మీ అన్నయ్య చేశాడు అంటుంది శైలూ. రఘురామ్ కిందికి వచ్చి రాజేశ్వరి దగ్గర కూర్చుంటాడు. ఏమైందిరా పెద్దోడా అంటే.. నా ఇంట్లోనే నేను పరాయివాడిని అయ్యాను అంటాడు రఘురామ్.

ఎవడ్రా నిన్ను అవమానించింది..అని అడుగుతుంది రాజేశ్వరి. రిషితో ఆడుకోవాలని నేను పైకి వెళ్లబోయాను. బాబును కొంతసేపు ఇవ్వు.. ఆడుకుంటా అని లక్కీతో అన్నా. దీంతో బాబు పడుకున్నాడని చెప్పాడు. నేను వెనుదిరిగే సమయానికి బాబు అరుపులు వినిపించాయి. పైకి వెళ్లి చూస్తే.. శైలూ బాబుతో ఆడుకుంటూ ఉంది. లక్కీ నాకు అబద్ధం చెప్పడం తట్టుకోలేకపోతున్నాను అంటాడు రఘురామ్.

Vadinamma 11 Nov Today Episode : సీత త్యాగం గురించి చెప్పి రఘురామ్ కళ్లు తెరిపించిన భాస్కర్

ఇంట్లో ఉండబుద్ధిగాక రఘురామ్ గుడికి వస్తాడు. అక్కడికి వచ్చిన భాస్కర్.. రఘురామ్ ను చూసి బావ ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు. కోపం నా మీదా లేక నా చెల్లెల్లు మీదా అని అడుగుతాడు. ఎవరి మీద కాదురా.. నామీద, నా దురదృష్టం మీద.. అంటాడు. మరి.. సీతను ఎందుకు బాధపెడుతున్నావు అంటాడు భాస్కర్. నేనెవరినీ బాధపెట్టడం లేదు అంటాడు రఘురామ్.

సీత ఎంత బాధపడిందో.. శైలూ కోసం ఎలా త్యాగం చేసిందో రఘురామ్ కు భాస్కర్ అర్థమయ్యేలా చెబుతాడు. నువ్వయితే శైలూను అలాగే వదిలేసి.. నీ బిడ్డతో సంబురాలు చేసుకునేవాడివా? సీత.. బిడ్డను త్యాగం చేసింది ఎవరికి.. పుట్టింటి వాళ్లకు కాదు కదా. నీ తమ్ముడికే కదా.. నీ ఇంటికే కదా అని అంటాడు భాస్కర్. మొత్తానికి రఘురామ్ కళ్లు తెరిపిస్తాడు భాస్కర్.

మరోవైపు లక్ష్మణ్ బాధపడుతూ కూర్చుంటాడు. భరత్ చూసి ఏమైంది అన్నయ్య అంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు అంటాడు. రిషి పడిపోవడం గురించి ఆలోచిస్తున్నావా అంటే.. అన్నయ్యలో వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తున్నాను అంటాడు. ఫ్రీగా మాట్లాడటం లేదు. తన లోకంలోనే ఉంటున్నాడు. ఎంతసేపు రిషి ద్యాసలోనే ఉంటున్నాడు.. అని అంటాడు లక్కీ.

మరోవైపు అనాథ ఆశ్రమం నుంచి లక్కీ ఇద్దరు వ్యక్తులను ఇంటికి పిలుస్తాడు. ఎవర్రా వీళ్లు అని రఘురామ్ అడిగే సరికి.. అనాథ ఆశ్రమం నుంచి వచ్చారు. వాళ్ల దగ్గర అనాథ పిల్లలు ఉన్నారు. ఎవరో ఒకరిని దత్తత తీసుకోవడం పిలిచాను అన్నయ్య అంటాడు లక్కీ. దీంతో రఘురామ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Pakistan : పాకిస్తాన్ లోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు.. పాక్ కు చుక్క‌లు చూపిస్తున్న భారత్

Pakistan : పాక్‌కు భారత్ చుక్క‌లు చూపిస్తుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక…

34 minutes ago

Realme 14 Pro Plus : బంప‌ర్ ఆఫ‌ర్.. రూ.32వేల రియల్‌‌మి ఫోన్ కేవలం రూ. 12వేల క‌న్నా త‌క్కువా?

అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌ల‌లో ఒక్కోసారి బంప‌ర్ ఆఫ‌ర్స్ పెడుతుంటారు. వాటి వ‌ల‌న కాస్ట్‌లీ ఫోన్స్ కూడా స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కి లభిస్తుంటాయి…

3 hours ago

Summer : వేస‌విలో ఈ చిన్న‌పాటి జాగ్ర‌త్త‌లు పాటిస్తే అంతా హాయే

Summer  : వేసవికాలం భరించలేనిది. మండే ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, వడదెబ్బ ప్రమాదాన్ని పెంచుతాయి. మనమందరం ఎండ రోజులను…

4 hours ago

Watermelon : పుచ్చకాయ తిన్న తర్వాత ఎప్పుడూ నీళ్లు ఎందుకు తాగకూడదు?

Watermelon : దేశంలో వేసవి కాలం జోరుగా సాగుతోంది. ప్రతి రోజు గడిచేకొద్దీ వేడి పెరుగుతోంది. ఈ మండే వేసవి…

5 hours ago

Period : పీరియడ్స్ క‌డుపు నొప్పి తగ్గించే చిట్కాలు..!

Period : పీరియడ్ క‌డుపునొప్పి భరించ‌లేనిదిగా ఉండొచ్చు. కానీ ఈ అసౌకర్య లక్షణాన్ని ఎదుర్కోవడానికి మీరు తీసుకోగల చిట్కాలు కొన్ని…

6 hours ago

AC : సగం ధరకే బ్రాండెడ్ ఏసీ.. ఈఎంఐలో రూ.1,478కే పొందండి

AC : రోజురోజుకి పెరుగుతున్న ఎండ‌ల తీవ్ర‌త‌ను భ‌రించ‌లేకుండా ఉన్నారా? ఓ మంచి ఏసీ కొనుక్కోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు…

7 hours ago

Migraines : మైగ్రేన్‌ నొప్పి భ‌రించ‌లేకుండా ఉన్నారా? ఈ హోం రెమిడీస్ ట్రై చేయండి

Migraines : మైగ్రేన్లను చికిత్స చేయడానికి, నివారించడానికి ఔషధం ఒక నిరూపితమైన మార్గం. కానీ ఔషధం చికిత్స‌లో ఒక భాగం…

8 hours ago

Sewing Mission Training : మహిళలకు కుట్టు మిష‌న్‌లో ఉచిత శిక్ష‌ణ.. ఈ 15 లోపు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం

Sewing Mission Training : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మహిళలకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు అందించింది. అనంతపురం జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ…

9 hours ago