
By Poll Date Announced For Atmakur, Any Opposition For YCP
YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక కోసం డిఫరెంట్ ఫార్ములాను అవలంభిస్తున్నారు. జగన్ ఫార్ములా ప్రతి సారి పని చేస్తుందా? అంటే ప్రతి సారి అదే ఫార్ములా వర్కవుట్ కాకపోవచ్చు అని పార్టీలోని సీనియర్ నాయకులే చెబుతుండడం గమనార్హం. జగన్ తన పద్ధతి మార్చుకోవాలని వాళ్లు ఒకటికి రెండు సార్లు సూచిస్తున్నారు. ఇంతకీ జగన్ అవలంభిస్తున్న ఫార్ములా ఏంటన్నది గమనిస్తే..
jagan following same formula again
ఎన్నికేదైనా కానీ జగన్ సామాజిక సమీకరణాలను పక్కాగా ఫాలో అవుతున్నారు. ఎన్నికలు కాకపోయినా పార్టీ పదవులు కట్టబెట్టే విషయంలో కూడా జగన్ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తన ప్రభుత్వంలో పెద్ద పీట వేస్తున్నారు. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా జగన్ ఇలా చేస్తున్నారని అనేక మంది చెబుతున్నారు. కానీ ప్రతి సారి సామాజిక వర్గాల ఫార్ములా వర్కవుట్ కాదనేది సీనియర్ల వాదన? ఇది వరకు భర్తీ చేసిన మూడు ఎమ్మెల్సీ పదవులనూ జగన్ ఇదే పద్ధతిలో ఫిల్ చేశారు. అంతే కాకుండా త్వరలో జరగబోయే 11 ఎమ్మెల్సీ స్థానాలకు చెందిన అభ్యర్థుల జాబితాను కూడా ఇదే విధానంలో ప్రకటిస్తారని ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి.
jagan following same formula again
కానీ ఇలా సామాజిక వర్గం ప్రకారం సీట్లు కేటాయించుకుంటూ పోతే వేరే సామాజిక వర్గాల్లో ఉన్న టాలెంటెడ్ పీపుల్ పార్టీకి దూరం అవుతారని కొంత మంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతిలో ముందుకు పోయినా ఎన్నికల్లో ఈ ఫార్ములా వర్కవుట్ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేమని సీనియర్లు పేర్కొంటున్నారు. అందుకోసం వాళ్లు మొన్నటి హుజూరాబాద్ ఉప ఎన్నికను చూపిస్తున్నారు. ఎల్. రమణ, మోత్కుపల్లి నర్సింహులు, కౌశిక్ రెడ్డి వంటి వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టినా కూడా ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందని చెబుతున్నారు. కాబట్టి సామాజిక వర్గాలను బట్టి సీట్లు కేటాయించేకంటే ప్రతిభ ఆధారంగా పని చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. అలా అయితే పార్టీకి మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…
Chiranjeevi Davos : స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
This website uses cookies.