vadinamma 14 november 2021 full episode
Vadinamma 14 Nov Today Episode : వదినమ్మ సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 14 నవంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 700 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సీతను క్షమించాలంటూ రఘురామ్ కోరిన విషయం తెలిసిందే. దీంతో నేను నిన్ను క్షమించడం కాదండి.. మీరే నన్ను క్షమించాలి అంటూ వేడుకుంటుంది సీత. దీంతో ఇద్దరూ కలిసిపోతారు. ఇద్దరి మధ్య దూరం తగ్గిపోతుంది. సీత చేసిన త్యాగాన్ని చివరకు గుర్తిస్తాడు రఘురామ్.
vadinamma 14 november 2021 full episode
మరోవైపు అనాథ ఆశ్రమం నిర్వాహకులను ఇంటికి పిలుస్తాడు లక్ష్మణ్. అన్నయ్య, వదిన బిడ్డలు లేక బాధపడుతున్నారు కదా. వాళ్ల కోసం ఓ బిడ్డను దత్తత తీసుకోవడం కోసం పిలిచాను అని చెబుతాడు లక్కీ. దీంతో రఘురామ్ షాక్ అవుతాడు. వాళ్లను పంపించేస్తాడు. నిజంగా నేను ఓ బిడ్డను దత్తత తీసుకోవాల్సిన అవసరం వస్తే.. నేను, మీ వదిన.. ఇద్దరం అనాథ ఆశ్రమానికే వెళ్లిపోతాం అని అంటాడు రఘురామ్. లక్ష్మణ్.. అసలు నువ్వేనా మాట్లాడేది.. నువ్వు కొత్తగా కనిపిస్తున్నావురా అంటుంది రాజేశ్వరి.
నువ్వు నిజంగా మీ అన్నయ్య సంతోషాన్నే కోరుకునేవాడివే అయితే.. ఇలా దత్తత గురించి మాట్లాడవురా. నీ బాబును తీసుకొచ్చి పెద్దోడి చేతుల్లో పెట్టేవాడివి అంటుంది రాజేశ్వరి. నువ్వు తినే ముద్దను త్యాగం చేస్తే దానం అంటారు. అదే పక్కవాళ్ల ప్లేట్ లో నుంచి తీసుకొని ఇస్తే.. అది దానం కాదురా అంటుంది రాజేశ్వరి. పెళ్లాం గురించి భయపడి ఆలోచించి ఇలా చేస్తున్నాడు అంటుంది రాజేశ్వరి.
నా వల్ల కాదు.. ఇక నేను ఆగలేను.. ఈ విషయం వెంటనే లక్ష్మణ్ కు చెబుతాను అని.. తర్వాత రఘురామ్ తో అంటుంది రాజేశ్వరి. కానీ.. రఘురామ్ అస్సలు ఒప్పుకోడు. సీత చేసిన త్యాగానికి విలువ ఇవ్వాలి అమ్మ. రిషి విషయం.. జీవితంలో కూడా లక్ష్మణ్, శైలూకు తెలియకూడదు అని రాజేశ్వరితో చెబుతాడు రఘురామ్.
సిరి, సీత ఇద్దరూ గుడికి వెళ్తారు. నువ్వు దేవుడిని ఏం కోరుకున్నావో నాకు తెలియదు కానీ.. రిషిని నీ బిడ్డగా ప్రకటించి.. వాడిని పెద్దబావ చేతుల్లో పెట్టాలన్నదే నీ కోరిక అయితే దానికి దేవుడు ఏం చేయలేడు. నువ్వే ధైర్యం చేసి శైలూకు నిజం చెప్పాలి అంటుంది సిరి. కానీ.. సీత ఒప్పుకోదు. శైలూకు ఎప్పుడైతే నా బిడ్డను ఇచ్చేశానో.. అప్పుడే మా ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది అంటుంది సీత.
మరోవైపు పార్వతి వెళ్లి దుర్గను కలుస్తుంది. లక్ష్మణ్.. తన అన్నను ఓ అనాథను దత్తత తీసుకోవాలంటూ సలహా ఇచ్చాడు అని చెబుతుంది. అవునా.. దెబ్బతో అన్నదమ్ముల మధ్య చిచ్చు రేగాల్సిందే. అన్నదమ్ములు ఇద్దరూ విడిపోవడం ఇక ఖాయం అంటుంది. అంతే కాదు.. ఇక ముందు నుంచి రిషిని ముట్టుకోనని రఘురామ్ అందరి ముందు మాట ఇచ్చాడట అంటుంది దుర్గ. దీంతో నా మనవరాలిని సంకలో వేసుకొని తిరుగుతాడేమో ఇక అంటుంది పార్వతి.
కట్ చేస్తే.. రఘురామ్, భరత్.. ఇద్దరూ ధాన్యం కొనుగోలు దగ్గర ఉంటారు. అక్కడికి జనార్ధన్, తన బావమరిది ఇద్దరూ వస్తారు. ఏంటి రఘురామ్.. ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్నావు అంటాడు జనార్థన్. సంపాదించింది అంతా ఎవరికి పెడుతున్నావు. అంటే పిల్లా జల్లా లేరు కదా అంటాడు జనార్థన్.
ఇంతలో భరత్ పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. లక్ష్మణ్ అన్నయ్య అంటూ పిలుస్తాడు. ఇన్నాళ్లు వీడు వీడి మామను ఛీకొట్టాడు. ఇప్పుడు ఆయనే వీడికి దేవుడు అయిపోయాడు. అనాథను దత్తతగా ఇప్పించమని.. ఆయనగారే నీ బిడ్డ లక్ష్మణ్ కు సలహా కూడా ఇచ్చారట.. అని సీత ముందు చెబుతాడు భరత్. దీంతో సీత షాక్ అవుతుంది.
అవును.. నేను మామయ్య గారి మాట విన్నాను తప్పేంట్రా అంటాడు లక్ష్మణ్. నేను చేసింది తప్పు కాదని ఇప్పటికీ అంటున్నాను. అన్నయ్య కూడా కొంచెం ఎక్కువే చేస్తున్నాడు.. అంటూ రఘురామ్ పై కూడా లక్ష్మణ్ సీరియస్ అవుతాడు. దీంతో రఘురామ్, సీత, భరత్.. అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటూ తరువాయిభాగంలో చూడాల్సిందే.
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
This website uses cookies.