vadinamma 19 november 2021 full episode
Vadinamma 19 Nov Today Episode : వదినమ్మ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 నవంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 704 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి.. ఇన్ని రోజులు నా కళ్లముందు ఉంటారు కదా అని అనుకున్నాను. కానీ.. ఇప్పుడు రిషి నానుంచి దూరం అయితే నేను తట్టుకోలేను సీత అంటాడు రఘురామ్. మీరు బాబు లేకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి.. తప్పదు బావా అంటుంది సీత. శైలూ, లక్ష్మణ్.. ఇద్దరూ మారుతారు. ఈ నాలుగు రోజుల్లో వారే మారి వస్తారు అంటుంది సీత.
vadinamma 19 november 2021 full episode
ఇంతలో నాని, శిల్ప వచ్చి.. శిల్ప వాళ్ల అమ్మకు బాగా లేదట.. అని చెబుతాడు నాని. దీంతో అయ్యో.. పొద్దున్నే శిల్పను దింపిరా అంటాడు రఘురామ్. దింపి రావడం కాదు అన్నయ్య.. నేను కూడా ఓ నాలుగు రోజుల పాటు ఉండి వస్తాను అంటాడు నాని. దీంతో షాక్ అవుతుంది సీత. రఘురామ్ కూడా బాధపడతాడు. మీ ఇష్టం అని చెబుతాడు రఘురామ్. జాగ్రత్తగా వెళ్లిరండి అని చెబుతాడు. ఏంటి బావా నాని కూడా వెళ్తా అంటున్నాడు అంటుంది. వెళ్లి రానీ సీత.. అంటాడు రఘురామ్.
కట్ చేస్తే ఉదయం అవుతుంది. రఘురామ్ షాప్ కు వెళ్తాడు. అక్కడ కూడా ఏదో కోల్పోయిన వాడిలా ఉంటాడు. కస్టమర్లు వచ్చినా కూడా పట్టించుకోడు. దీంతో ఒక కస్టమర్ వచ్చి సమయం అయిపోయిందని వెళ్లిపోతాడు. ఎందుకు అలా ఉన్నావు అన్నయ్య అంటాడు. నీకేమన్నా ఒంట్లో బాగా లేదా అని అంటాడు. రిషిని చూడాలని అనిపిస్తోందా అంటాడు.
రిషిని తలుచుకుంటూనే ఇంటికి వస్తాడు రఘురామ్. బావా భోం చేద్దువు కానీరా అని పిలుస్తుంది సీత. వచ్చి కూర్చొని అన్నం తినకుండానే లేస్తాడు రఘురామ్. రిషియే గుర్తొస్తుంటాడు రఘురామ్ కు. రిషి ఉన్నట్టుగా ఊహించుకొని.. రిషితో ఆడుకున్నట్టుగా ప్రవర్తిస్తాడు రఘురామ్. దీంతో సీత చూసి భయపడుతుంది.
కట్ చేస్తే జనార్ధన్ ఇంట్లో శైలూ, లక్ష్మణ్.. ఇద్దరూ భోం చేస్తుంటారు. ఆ ఇంటికీ ఈ ఇంటికి ఉన్న తేడా ఒక్కటే అల్లుడు గారు. అక్కడ మీ అన్నయ్య ఉంటాడు.. ఇక్కడ ఉండడు.. అని లక్ష్మణ్ కు చెబుతాడు జనార్ధన్. ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ నొక్కుతారు. లింగం వెళ్లి ఎవరో అని చూస్తాడు.
దీంతో రిషిని వదిలేసి వెళ్తాడు లింగం. దీంతో రిషి.. ఒక్కడే మెట్లు ఎక్కి వెళ్తాడు. రిషి విషయాన్నే ఎవ్వరూ పట్టించుకోరు. దీంతో రిషి.. మెట్ల మీది నుంచి కింద పడిపోయినట్టు రఘురామ్ కలగంటాడు. సీత.. బాబు మెట్ల మీది నుంచి కింద పడిపోయాడు అంటాడు సీతతో. దీంతో అది కల బావ.. నిజం కాదు అంటుంది సీత.
తర్వాత సీత పడుకుంటుంది. ఎలాగైనా బాబును ఓసారి చూసి రావాలని అనుకుంటాడు రఘురామ్. దీంతో జనార్ధన్ ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి వచ్చి దొంగచాటుగా రిషిని కలవడం కోసం లోపలికి వెళ్తాడు. మరోవైపు జనార్ధన్, లింగం, శైలూ, లక్ష్మణ్.. కలిసి పేకాడుతుంటారు.
ఇంతలో రిషి ఏడుపు వినిపిస్తుంది. దీంతో రఘురామ్ చాలా ఖుషీ అవుతాడు. కానీ.. బాబు మెట్ల దగ్గరికి ఏడుస్తూ వస్తాడు. బాబును ఆ పరిస్థితిలో చూసి రఘురామ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.