chandrababu
Chandrababu : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మున్సిపల్ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయనే చెప్పొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఒకే ఒక్క మున్సిపాలిటీ తప్ప మిగతా అన్ని చోట్ల సత్తా చూపలేకపోయింది. ఇక అధికార వైసీపీ ఈ ఎన్నికల్లో హవా చూపింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ విజయ కేతనం ఎగురవేసింది. తన సొంత నియోజకవర్గంలో పట్టు నిలుపుకోలేకపోయిన చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి పూర్వ వైభవం తీసుకురాగలడా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పట్ల చంద్రబాబు కాని టీడీపీ శ్రేణులు కాని అధికార వైసీపీపైన ఆరోపణలు చేయొచ్చు.
chandrababu
కాని, పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలోనే టీడీపీ ఓటమి పాలవడం పట్ట పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఎంత అనేది చర్చనీయాంశమవుతున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు కాని నేతలు కాని ప్రతీ సారి రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కానీ, నిజానికి టీడీపీ ప్రజల్లో ఉందా అనే విషయం ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. జనంలోకి వెళ్లకుండా కేవలం పార్టీ కార్యాలయల్లో దీక్షలు చేసో లేదా విమర్శలు చేయడం వలన పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటే పొరపాటే అవుతుందని అంటున్నారు.
అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించొచ్చు. కానీ, ఏడు సార్లు కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అక్కడ కూడా పట్టు నిలుపోలేకపోవడం ద్వారా పార్టీ పరిస్థితి, ప్రభావం తగ్గిందని అంచనా వేసుకోవచ్చు. మిగిలిన మున్సిపాలిటీల్లో టీడీపీ అంతో ఇంతో ఫైట్ ఇచ్చినప్పటికీ కుప్పంలో ఫైట్ ఇవ్వకపోవడం పట్ల ఆ పార్టీ శ్రేణులూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయట. అధినాయకత్వ లోపం ఉందా అని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పర నింద చేసే ముందర ఆత్మ పరిశీలన చేసుకోవాలనే పలువురు సూచిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి ఉంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.