vadinamma 29 october 2021 full episode
Vadinamma 29 Oct Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదల అయింది. ఈరోజు 29 అక్టోబర్, 2021 శుక్రవారం ఎపిసోడ్ 686 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజేశ్వరి.. రిషీని చూస్తూ బాధపడుతుంది. ఇంతలో సీత వచ్చి చూస్తుంది. నువ్వు నా పెద్ద కొడుకు కొడుకువిరా. ఈ ఇంటి వారసుడివిరా. నువ్వు నాకు పెద్ద కొడుకు కొడుకువని గట్టిగా అరవాలని ఉందిరా అని అంటుంది. నేను ఊరుకోను. నా వల్ల కాదు. చెప్పేస్తాను అంటూ ఆవేశపడుతుంది రాజేశ్వరి. ఇంతలో సీత వచ్చి రిషీని తీసుకుంటుంది. ఏంటి అత్తయ్య మీరు చేసేది అంటుంది.. ఎవరైనా వింటే ఏం కావాలి అంటుంది సీత. ఎందుకు అత్తయ్య ఇలా నన్ను మాటలతో హింసిస్తున్నారు. నన్ను ఎందుకు అర్థం చేసుకోరు అంటుంది సీత.
vadinamma 29 october 2021 full episode
ఇప్పుడు నువ్వు త్యాగం చేశావు అని అనుకోవచ్చు. రేపు నీ కొడుకుకు ఈ విషయం తెలిస్తే ఏం చేస్తావు. వాడు నిన్ను నిలదీస్తే ఏం చేస్తావు. నిన్ను ఛీ కొడతాడు. అసహ్యించుకుంటాడు.. అంటుంది రాజేశ్వరి. నా కొడుకుకు ఏమైనా అయిందంటే నేను అస్సలు ఊరుకోను అంటుంది రాజేశ్వరి. బావకు ఏం కాదు అత్తయ్య అంటుంది. ఇంతలో డాక్టర్ సీతకు ఫోన్ చేసి అర్జెంట్ గా ఆసుపత్రికి రమ్మంటాడు.
వెంటనే ఆసుపత్రికి వస్తారు సీత, లక్ష్మణ్. డాక్టర్ ఏమైంది అని అడుగుతారు. అతడి మనసులో ఏదైనా దిగులు కానీ తీరని కోరిక కానీ ఉందా? అని అడుగుతాడు డాక్టర్. మీ అన్నయ్య అస్సలు ట్రీట్ మెంట్ కు సహకరించడం లేదు. మా ప్రయత్నం మేం చేస్తున్నాం. ఆయన మనసులో ఏ దిగులు ఉందో అది తీర్చే ప్రయత్నం మీరు చేయండి. త్వరగా కోలుకుంటాడు. లేకపోతే ఆ దేవుడి మీద భారం వేయాల్సిందే అంటాడు డాక్టర్. దీంతో సరేనండి.. మా ప్రయత్నం మేం చేస్తాం అంటాడు డాక్టర్.
వెంటనే రఘురామ్ ఉన్న గదికి వెళ్తారు సీత, లక్ష్మణ్. మనతో అన్నయ్యకు మాట్లాడటం ఇష్టం లేదనుకుంటా. తను ప్రశాంతంగా పడుకొని మనకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు. మేం అడిగితే నీకు ఏం చేయకుండా ఉన్నాం. నువ్వు ఏది అడిగినా ఇస్తాం అన్నయ్య అంటాడు లక్ష్మణ్. తప్పంతా నీదే వదినమ్మ.. అని అంటాడు లక్ష్మణ్. అన్నయ్య మనసులో ఏముందో నీకు తెలియాదా? అన్నయ్య బాధ నువ్వు పట్టించుకోవా? ఎంత సేపు మా సంతోషం గురించి ఆలోచించడమేనా? అన్నయ్య గురించి కూడా ఆలోచించాలి కదా నువ్వు.. అని లక్ష్మణ్ అంటాడు. అన్నయ్య మనసును అర్థం చేసుకొని ఉంటే అన్నయ్య బాగుండేవాడు. కానీ.. ఇప్పుడు అన్నయ్య ఎలా ఉన్నాడు చూడు.. అంటాడు లక్ష్మణ్.
vadinamma 29 october 2021 full episode
కట్ చేస్తే.. అందరు కోడళ్ల తల్లిదండ్రులు రఘురామ్ ఇంటికి వస్తారు. రఘురామ్ బతకడం కష్టం అంటున్నారు డాక్టర్లు అని శైలూ తండ్రి అంటాడు. దీంతో నోర్మూయ్.. అని రాజేశ్వరి అంటుంది. ఏ తల్లికైనా కొడుకు గురించి ఈ మాట వినాలనిపిస్తే బాధగానే ఉంటుంది. కానీ.. ఇంటి పెద్ద అటూఇటూగా ఉన్న సమయంలో ఆస్తుల పంపకాల గురించి మాట్లాడుకోవాలి కదా అంటారు. ఇంతలో సీత వచ్చి సీరియస్ అవుతుంది. నా బావ గురించి తప్పుగా మాట్లాడుతారా? అంటూ సీరియస్ అవుతుంది. కానీ.. రాజేశ్వరి, సీత మధ్య గొడవ అవుతుంది. ఇన్ని రోజులు అందరూ ఒకరి ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లాల్సిందే అంటుంది పార్వతి. ఎవరి కూతురు, అల్లుండ్లను వాళ్లు తీసుకొని వెళ్తారు అంటుంది పార్వతి. దీంతో ఎవరి నిర్ణయం వారిది అంటుంది సీత. కానీ.. ఎవ్వరూ వెళ్లడానికి ఇష్టపడరు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.