Vaishnav Tej career is Ranga Ranga Vaibhavanga movie
Vaishnav Tej : అన్నిటికంటే కూడా కొవిడ్ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీ మీద, టాలీవుడ్ హీరోల మీద ఎక్కువగా ప్రభావం చూపించింది. ఇప్పటికీ ఇండస్ట్రీ కోలుకోనేలేదని చెప్పాలి. 10 సినిమాలు రిలీజైతే ఒక్క సినిమా హిట్ సాధిస్తుంది. మిగతా తొమ్మిది సినిమాలు కనీసం యావరేజ్‌గా కూడా నిలవడం లేదు. 2022లో ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలే నిర్మాతలను గట్టెక్కించాయి. మిగతా సినిమాలన్నీ నిర్మాతలకు బాగా నష్టాలను మిగిల్చినవే. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేశ్ బాబు లాంటి అగ్ర హీరోలకే ఫ్లాప్స్ తప్పలేదు. ఇక మీడియం హీరోలకు హిట్స్ ఎక్కడొ స్తాయని దీని కారణంగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్ లేకపోలేదు.
ఇక కొందరి హీరోల పరిస్థితి ఎటూ చెప్పలేకుండా ఉంది. వెంకటేశ్ – వరుణ్ తేజ్ కలిసి ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 సినిమా చేస్తే ఆ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి అందరి అంచనాలను తలకిందులు చేసింది. అంతకముందు వెంకీ నారప్ప, దృశ్యం 2 సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసి కూడా హిట్ అందుకున్నారు. నిర్మాతలకు మంచి లాభాలే వచ్చాయి. కానీ, వరుణ్ తేజ్ గని సినిమా చేసి ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో మరో మెగా హీరో గురించి టాక్ నడుస్తోంది. పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే.ఈ సినిమా పాతికేళ్ళ నుంచి ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టింది.
Vaishnav Tej career is Ranga Ranga Vaibhavanga movie
డెబ్యూ హీరోగా హిందీలో కహోనా ప్యార్ హై సినిమాతో హృతిక్ రోషన్, చిరుత సినిమాతో రామ్ చరణ్ రికార్డులు క్రియేట్ చేశారు. ఇన్నేళ్ళుగా వారి రికార్డులను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఏ హీరో బ్రేక్ చేయలేదు. కానీ, వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ఆ రికార్డులను బ్రేక్ చేసి కొత్తగా వచ్చే హీరోలకు సవాల్ విసిరాడు. అయితే, దీని తర్వాత వచ్చిన కొండపొలం సినిమా ఫ్లాప్ కావడం షాకింగ్ విషయ. అందుకే, ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కెరీర్ కాస్త డైలమాలో ఉందనే టాక్ వినిపిస్తోంది. గిరీశయ్య దర్శకత్వంలో రంగ రంగ వైభవంగా అనే సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ ఇందులో హీరోయిన్. ఈ సినిమా మీదే వైష్ణవ్ తేజ్ కెరీర్ ఆధారపడి ఉంది. ఇది గనక సక్సెస్ సాధించకపోతే ఏకంగా మెగాస్టారే రంగంలోకి దిగాల్సి వస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.