Varun Sandesh And Vithika Sheru Workouts
Vithika Sheru : వరుణ్ సందేశ్, వితిక షెరు జంటకు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. సినిమాల ద్వారా ఒక్కటైనా.. స్నేహం, ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నా కూడా..చివరకు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాకే ఈ జంటకు క్రేజ్ పెరిగింది. బిగ్ బాస్ మూడో సీజన్‌లో వరుణ్ సందేశ్ వితికషెరు చేసిన సందడి అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ షోలో వల్ల వరుణ్‌కు ఫుల్ పాజిటివ్ ఇమేజ్ రాగా.. వితికషెరుకు ఫుల్ నెగెటివ్ ఇమేజ్ ఏర్పడింది. అయితే బిగ్ బాస్ టీం మీద కూడా వితిక మండి పడింది. వాళ్లకు కావాల్సినవే వేసుకుంటారని, 24 గంటలు జరిగే షోను.. గంట పాటుగా ప్రసారం చేస్తారంటూ వితిక చెప్పుకొచ్చింది.
బిగ్ బాస్ షో వల్ల తన మీద జరిగిన ట్రోలింగ్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లినట్టుగా వితిక షెరు ఓ వీడియోను వదిలింది. బిగ్ బాస్ షోలో చూసి మమ్మల్ని జడ్జ్ చేయకండని, లోపల జరిగేది వేరు.. బయటకు చూపించేది వేరే అంటూ ఇలా బిగ్ బాస్ షో గురించి వితిక ఓ సుధీర్ఘమైన వీడియోను షేర్ చేసింది. అయితే బిగ్ బాస్ షో తరువాత ఈ ఇద్దరి కెరీర్ మంచి ఊపు మీదుంటుందని అందరూ భావించారు. కానీ వరుణ్ సందేశ్ ఓ సినిమా తీయడానికి రెండు మూడేళ్లు సమయం తీసుకున్నాడు. ఇక వితిక షెరు మాత్రం బుల్లితెరపై ఓ షోకు యాంకర్‌గా చేసి అంతటితోనే సరిపెట్టేసుకుంది. సామజవరగమన అంటూ ఈటీవీలో వచ్చిన సింగింగ్ షోకు వితిక, నోయల్ సంయుక్తంగా హోస్టింగ్ చేశారు. ఇక ఇప్పుడు వితిక తన యూట్యూబ్ చానెల్‌తోనే బిజీగా ఉంటోంది.
Varun Sandesh And Vithika Sheru Workouts
తన పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. వితిక షెరు యూట్యూబ్ చానెల్‌కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. మొన్నటి వరకు యూఎస్‌లో సందడి చేసిన విషయాలన్ని షేర్ చేసింది. ఇక వరుణ్ సందేశ్‌తో కలిసి చేసిన రీల్ వీడియోలను షేర్ చేయడంతో అవి కూడా బాగానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ జంట జిమ్‌లో తెగ కష్టపడుతోంది. ఈ ఇద్దరూ వర్కవుట్లతో నానా తంటాలు పడుతున్నారు. అయితే వరుణ్ సందేశ్ ఎంతలా కష్టపడుతున్నాడో.. వితిక కూడా అంతే కష్టపడుతోంది. పర్ఫెక్ట్ ఫిజిక్ కోసం వితిక బాగానే చెమటోడ్చుతోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా వరుణ్ వితిక ట్రైనర్ ఓ వీడియోను షేర్ చేయగా.. అది వైరల్ అవుతోంది.
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
This website uses cookies.