Home » Entertainment » Varun Tej Matka Movie Review
Entertainment

Matka Movie Review : వరుణ్ తేజ్ ‘మట్కా’ ఫస్ట్ రివ్యూ.. మెగా హీరో హిట్టు కొట్టాడా.. లేదా..?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: November 13, 2024, 4:01 pm
Advertisement

Matka Movie Review : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ Varun Tej లేటెస్ట్ మూవీ మట్కా Matka  Review రేపు గురువారం అనగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్. ఎస్.ఆర్.టి మూవీస్ కలిసి నిర్మించిన ఈ సినిమాను కరుణ కుమార్ డైరెక్ట్ Karuna Kumar చేశారు. మట్కా ట్రైలర్ తోనే సినిమా ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చేలా చేశారు. ఇక ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. కొంతమంది సినీ ప్రముఖులకు సినిమా ప్రీమియర్ వేయగా అక్కడ నుంచి సినిమాకు మంచి టాక్ వచ్చినట్టు తెలుస్తుంది.

Advertisement

కరుణ కుమార్ మట్కా కథను 1958 నుంచి 1982 మధ్యలో జరిగే కథగా రాసుకున్నాడని తెలుస్తుంది. వాల్తేరుకి చెందిన వాసు (వరుణ్ తేజ్) ఒక కూలీ ఐతే అతను తన తప్పు లేకుండానే చిన్నప్పుడే జైలుకి వెళ్తాడు. అక్కడ అతను చాలా కఠినంగా మారిపోతాడు. బయటకు వచ్చాక డబ్బు సంపాదించడమే అతని లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఇంతలోనే అతనికి సుజాత (మీనాక్షి చౌదరి)  Meenakshi Chaudhary తారసపడుతుంది. ఆమెతో ప్రేమలో పడిన వాసు సోఫియా (నోరా ఫతేహి) వల్ల కొన్ని ఇబ్బనికర పరిస్థితులను ఎదుర్కొంటాడు. ఫైనల్ గా వాటి నుంచి వాసు ఎలా బయట పడ్డాడు అన్నదే సినిమా.

Matka Movie Review : వరుణ్ తేజ్ ‘మట్కా’ ఫస్ట్ రివ్యూ.. మెగా హీరో హిట్టు కొట్టాడా.. లేదా..?

Advertisement

సినిమాలో వరుణ్ తేజ్ నాలుగు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడని తెలుస్తుంది. సినిమాతో వరుణ్ తేజ్ కి నిజంగానే మంచి పేరొస్తుందని అంటున్నారు. కరుణ కుమార్ స్టోరీ టెల్లింగ్ ఇంకా స్క్రీన్ ప్లే బాగున్నాయని అంటున్నారు. మరి ఫస్ట్ రివ్యూ సూపర్ అనిపించగా రేపు అసలు టాక్ ఏంటన్నది తెలుస్తుంది. కొన్నాళ్లుగా కెరీర్ లో సరైన సక్సెస్ లేని వరుణ్ తేజ్ మట్కా కోసం చాలా కష్టపడ్డానని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. ఈ సినిమాతో మెగా హీరో హిట్ కొడతాడా లేదా అన్నది మరో 24 గంటల్లో తెలుస్తుంది. Mega Hero, Varun Tej, Matka Review

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి