Venkatesh fans unhappy with his movies
Venkatesh : టాలీవుడ్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్. ఆయన స్టార్ హీరోల్లో టాప్ లో ఉండేవారు. అలాంటి స్టార్ హీరో ఇప్పుడు వరుసగా సినిమాలు చేయడంలో విఫలమవుతున్నాడు. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడడంతో పాటు ఆయన వరుసగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు అనేది సమాచారం. ఆయన స్టార్ హీరో కనుక వరుసగా సినిమాలు వస్తూనే ఉంటాయి, కానీ ఆయనకు సరిపడా కథలు మాత్రం రావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అవకాశాల గురించి ఎవరికి అనుమానం లేదు, కానీ ఆయన యొక్క సినిమాల ఎంపిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వరుసగా కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్న సినిమాలను ఆయన చేయడం వల్ల కెరియర్ కాస్త అటు ఇటు అయింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయంలో వెంకటేష్ ఇప్పటికైనా కొత్త నిర్ణయాన్ని తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రెగ్యులర్ గా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను చేయడం ద్వారా మంచి సక్సెస్ లను దక్కించుకునే అవకాశం ఉంది కానీ ఆయన మాత్రం అలా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు బదులు ప్రయోగాత్మక సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన కనుక మళ్ళీ మళ్ళీ ప్రయోగాత్మక సినిమాలు చేస్తే హీరోగా ఆయన కెరియర్ మసక బారిపోయినట్లే అవుతుందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో వెంకటేష్ యొక్క కొత్త సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆయనతో పలువురు దర్శకులు సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నా కూడా ఆయన మాత్రం చాలా విభిన్నమైన సినిమాలను చేసే ఉద్దేశంతో ప్రయోగాత్మక సినిమాలను చేసే ఉద్దేశంతోనే కొత్త కథలను వింటున్నాడు. ఇటీవల ఆయన ఒక విభిన్నమైన కథను విన్నాడని ఆ కథకు ఓకే చెప్పాడని సమాచారం అందుతుంది.
Venkatesh fans unhappy with his movies
రీమేక్లతో పాటు ప్రయోగాత్మక సినిమాలు చేయడం ద్వారా ఈ సమయంలో ఆయన కెరియర్లో సక్సెస్ అవ్వాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కమర్షియల్ సినిమాలతో సక్సెస్ అయినంతగా రెగ్యులర్ ప్రయోగాత్మక సినిమాలో సక్సెస్ అవ్వవు అనేది ఆయన గుర్తుంచుకోవాలి అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంతో మంది సీనియర్ స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలు చేస్తూ వరుసగా సక్సెస్ లు దక్కించుకుంటూ ఉంటే వెంకటేష్ మాత్రం ప్రయోగాత్మక సినిమాలో అంటూ ఈ సమయంలో వరుస ప్లాపులకు ఎందుకు గురి కావాల్సి వస్తుంది అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ ఓరి దేవుడా అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాలో వెంకటేష్ దేవుడిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా సంగతి పక్కన పెడితే మరో యువ దర్శకుడికి విభిన్నమైన కథ అంటూ ఓకే చెప్పాడట, ఆ కథ ఎలా ఉంటుంది మరో ప్రయోగానికి వెంకటేష్ సిద్ధమైతే ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది చూడాలి.
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
This website uses cookies.