Rakul Preet Singh : అవి తప్పాయి.. ఈ సారి రకుల్ విడాకులు మాత్రం పక్కా అంటూ వేణు స్వామి స్టన్నింగ్ కామెంట్
Rakul Preet Singh : ఇటీవలి కాలంలో వేణు స్వామి జాతకాలతో తెగ వార్తలలో నిలుస్తున్నాడు. ముఖ్యంగా ఆయన సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌లు సీఎం అవుతారని చెప్పిన వేణు స్వామి జాతకం తప్పని తేలాయి. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.
సమంత నాగ చైతన్య విడాకుల గురించి చెప్పి పాపులర్ అయిన వేణు స్వామి స్టార్ హీరోల ఆరోగ్యం పై కూడా కామెంట్స్ చేశారు వేణు స్వామి. అలాగే ప్రభాస్ ఇక పై హిట్స్ అందుకోలేడు అని చెప్పారు. కానీ ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు. ఇక వేణు స్వామి రష్మిక మందన్న, డింపుల్ హయతి, నిధి అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి అషు రెడ్డి, ఇనాయ సుల్తానా లాంటి బుల్లితెర నటుల వరకు అందరికి స్పెషల్ పూజలు చేస్తూ ఉంటారు. అయితే వేణు స్వామి తాజాగా రకుల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో చెప్పినవి 90 శాతం సక్సెస్ అయ్యాయని, ఫెయిల్ అయిన 10 శాతం గురించి చెబుతున్నారు కానీ, సక్సెస్ 90 శాతం గురించి ఎవరు మాట్లాడటం లేదని వేణు స్వామి చెప్పుకొచ్చారు.
Rakul Preet Singh : అవి తప్పాయి.. ఈ సారి రకుల్ విడాకులు మాత్రం పక్కా అంటూ వేణు స్వామి స్టన్నింగ్ కామెంట్
విమర్శకుల గురించి తాను పట్టించుకోనని, పని పాట లేని వారే నాపై విమర్శలు చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమయంలో వేణు స్వామి మాట్లాడుతూ..హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకున్న తర్వాత అంతగా కలిసిరాదని, ఆమె పలు సమస్యలు ఎదుర్కొంటుందని తానే ముందే చెప్పానని, తాను చెప్పినట్టుగానే ఆమె వైవాహిక జీవితం సాగుతోందని వేణు స్వామి తెలిపారు. రకుల్ భర్త జాకీ భగ్నానీకు బాలీవుడ్‌లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉంది. దీని ద్వారా పలు సినిమాలు తెరకెక్కించారు. ప్రస్తుతం ఈజంట చాల హ్యాపీగా ఉన్నారు. మరి వేణు స్వామి చేసిన కామెంట్స్ నిజం అవుతాయా లేదా అనేది చూడాలి.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.