
venu Thottempudi about boyapati Srinu Dammu Movie
Venu Thottempudi : కథలు వినిపించడం గురించి అందరికీ తెలిసిందే. కథలు చెబుతున్నావా? అని వేలాకోలంగా అంటుంటాం కదా? అలానే కొందరు దర్శకులు కూడా కథలు వీర లెవెల్లో నెరేట్ చేస్తారు. నటీనటులు, హీరోల దగ్గరకు వెళ్లి తమ తమ కథలను చెబుతుంటారు. అయితే కథలు చెప్పేటప్పుడు, చెప్పిన దాన్ని తీసేటపప్పుడు ఎంతో తేడా కనిపిస్తుంటుంది. ఇక పాత్రలు నెరేట్ చేసేందుకు వెళ్లినప్పుడు దర్శకులు కాస్త అతి చేస్తుంటారు. మీ పాత్రే గ్రేట్.. అద్భుతంగా, అదుర్స్ అంటూ పొగిడేసి చెబుతుంటారు. మొత్తానికి పాత్రను ఒప్పుకునేలా చేస్తారు.
కానీ తీరా సినిమా చూస్తే.. తేడా కొట్టేస్తుంటుంది. అలా తనను బోల్తా కొట్టించిన బోయపాటి శ్రీను గురించి వేణు తొట్టెంపూడి సంచలన విషయాలు బయటపెట్టేశాడు. వేణు చాలా ఏళ్ల తరువాత రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే బోయపాటి మీద కామెంట్స్ చేశాడు. షోలోలే అమితాబ్ లాంటి పాత్ర నీది.. అని దమ్ములో వేణుని తీసుకొన్నాడట బోయపాటి.
venu Thottempudi about boyapati Srinu Dammu Movie
ఇక సినిమా చూసిన వారికి వేణు పాత్ర ఏ పాటిదో అందరికీ తెలిసిందే.ఎడిటింగ్ లో చాలా సీన్లు లేచిపోయాయట. ‘షోలేలో అమితాబ్ పాత్ర అన్నారు. తీరా చూస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ సినిమాలో అమితాబ్ చనిపోయినట్టు.. దమ్ములో నేను చనిపోతాను. ఈ రెండు సినిమాల మధ్య పోలిక అదొక్కటే’ అని తనపై తనే సెటైర్ వేసుకొన్నాడు. అయితే ఆ సినిమా చేసినందుకు ఎప్పుడూ ప్రశ్చాత్తాపపడలేదని చెప్పాడు. మొత్తానికి దర్శకులు ఎలాంటి మాయమాటల్ని చెప్పి నటీనటుల్ని బురిడీ కొట్టిస్తారో ఇదొక ఉదాహరణ.
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
This website uses cookies.