Vidya Balan : పుష్ప.. పుష్పరాజ్ రఫ్ఫాడించేస్తున్నాడు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దేశ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సాధించింది. విడుదలైన అన్ని చోట్ల భారీ విజయాన్ని దక్కించుకొని కలెక్షన్ల సునామీ సృష్టించింది. నిజానికి పుష్ప సినిమా కేవలం ప్రాంతానికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన మూవీ, కానీ కథలో కంటెంట్ ఉండాలనే కానీ భాష, ప్రాంతంతో సంబంధం లేదని రుజువు చేసిందీ సినిమా. ఈ సినిమా ఓటీటీలో, బుల్లితెరపై సందడి చేస్తున్నా కూడా క్రేజ్ ఇప్పటికీ తగ్గడం లేదు.
ఈ సినిమా పాటలు సోషల్ మీడియాలో మార్మోగుతూనే ఉన్నాయిఇక పుష్పలో డైలాగ్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాయలసీమ స్లాంగ్‌లో అల్లు అర్జున్ పలికించిన డైలాగ్‌లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో డైలాగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా పాటలకు, డైలాగ్స్‌కి తెగ రీల్స్ చేస్తున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు కూడా ఇందులో భాగం అవుతున్నారు. ముఖ్యంగా ‘శ్రీవల్లి’ పాటకు జనం ఫిదా అయిపోయారు. ఈ పాటలో బన్నీ ఎక్స్‌ప్రెషన్స్, ఆయన వేసిన ఐకానిక్ స్టెప్పు నెట్టింట ఎంత వైరల్‌గా మారాయో మనందరికీ తెలిసిందే.
ఇక పుష్ప స్టెప్పును ఇమిటేట్ చేస్తూ ఎంతో మంది సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేస్తూ హంగామా చేస్తూ వచ్చారుడర్టీ బ్యూటీ విద్యా బాలన్ వేసిన శ్రీవల్లి స్టెప్స్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆమె అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ పుష్ప చిత్రం క్రేజ్‌ను మరోసారి వైరల్ చేస్తున్నారు. విద్యా బాలన్ తగ్గేదే లే అంటూ భలే కేక పెట్టించిందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప పార్ట్ 2 కూడా త్వరలో పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.