Home » Entertainment » Vignesh Shivan Missing Nayanthara
Entertainment

Nayanthara : న‌య‌న‌తారని వ‌దిలి దూరంగా వెళ్లిన ప్రియుడు.. ఇద్ద‌రికి చెడిందా ఏంటి?

Authored By
Sam C
The Telugu News | Published on: February 6, 2022, 3:00 pm
Advertisement

Nayanthara : కోలీవుడ్ క్రేజీ జంట విఘ్నేష్ శివ‌న్, న‌య‌న‌తార ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వారు చెట్ట‌ప‌ట్టాలు వేయ‌డం అప్పుడ‌ప్పుడు పార్టీల‌లో ఎంజాయ్ చేయ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. లేడీ సూపర్‌స్టార్‌ నయనతార సినిమాలతో కంటే లవ్ ఎఫైర్స్, బ్రేకప్స్ విషయంలోనే ఎక్కువ పాపులర్‌ అయ్యింది. గత నాలుగేళ్లుగా నయన్‌.. తమిళ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే తమ పెళ్లి ఉంటుందని, అందుకు డబ్బులు కూడబెడుతున్నాం అంటూ విఘ్నేశ్‌ ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.ప్రియుడితో కలిసి నయన్ వేస్తున్న డేరింగ్ స్టెప్స్ జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.ఒక‌వైపు సినిమాలు మ‌రో వైపు టూర్స్‌తో ఈ జంట చేస్తున్న ర‌చ్ మాములుగా లేదు.

Advertisement

పెళ్ళికి ముందే వీరిద్దరూ కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ‘రౌడీ పిక్చర్స్‌’ బ్యానర్‌‌ను ప్రారంభించి మంచి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక విఘ్నేష్ ఎప్పుడు, ఎక్కడికి వెళ్లినా నయన్ పక్కనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ప్రియురాలిని వెంటతీసుకెళ్లకుండా వెళ్లాడు ఈ డైరెక్టర్ . దీంతో నయన్ ని మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు.నయన్ ఫోటో షేర్ చేస్తూ ” ఈసారి నీతో ట్రావెలింగ్ ని మిస్ అవుతున్నాను.. ఒక పని పెండింగ్ లో ఉండడంతో నేను ఒక్కడినే రావాల్సి వచ్చింది. త్వరగా ఈ పని ముగించుకొని వచ్చేస్తాను..

Vignesh Shivan missing nayanthara

Advertisement

Nayanthara : పాపం ఈ ఇద్ద‌రి ప‌రిస్థితి ఇలా అయిందేంటి..

లాంగ్ హాలిడే కి వెళ్దాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా, పెళ్లయ్యాక కెరీర్ ఎలా ఉన్నా కూడా బిజినెస్ పరంగా టాప్ రేంజ్‌లో ఉండాలని ఇద్దరూ భావిస్తున్నారట. ఈ మేరకు విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని తెలుస్తోంది. దుబాయ్‌కి చెందిన ఓ ఆయిల్ కంపెనీలో ఏకంగా 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఆ కంపెనీతో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది తెలిసి పెళ్ళికి ముందే ఇంత స్పీడా? అంటూ ఆశ్చర్యపోతున్నారు జనం.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి