Home » Entertainment » Vijay Devarakonda Ananya Shocking The Audience
Entertainment

Vijay Devarakonda : స్టేజ్ మీద విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ముద్దు అడిగిన అన‌న్య‌.. అంద‌రి ముందే కానిచ్చేశాడుగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: July 22, 2022, 8:00 pm
Advertisement

Vijay Devarakonda : అర్జున్ రెడ్డి సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన విజ‌య్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తూ దూసుకుపోతున్నారు. ఇక విజ‌య్ మోస్ట్ అవైయిటెడ్ సినిమా లైగర్. దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. నిన్న విడుదలైన లైగర్ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.

Advertisement

Vijay Devarakonda : విజ‌యా, మ‌జాకానా ?

స్టార్ హీరో సినిమాల ట్రైల‌ర్ రిలీజ్ కి కూడా ఇంత హంగామా జరిగి ఉండ‌దు. ఈ వేడుకలో విజయ్ అభిమానులు చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ కటౌట్.. పాలాభిషేకాలు, పోతురాజుల నృత్యాలు, బ్యాండ్ మేళంతో సుదర్శన్ థియేటర్ వద్ద రచ్చ చేశారు. ఇక‌సాయంత్రం హింది ట్రైలర్ ను ముంబాయిలో విడుదల చేయగా.. ఆ వేడుకకు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలో భాగంగా హీరో విజయ్, అనన్య, రణ్ వీర్ సింగ్ లు కలిసి ‘అకిడి.. పకిడి’ సాంగ్ కు డ్యాన్స్ చేశారు. హీరోయిన్ ముద్దు అడగగా విజయ్ అనన్యకు ముద్దు పెట్టాడు. రణ్ వీర్ ని ముద్దు అడగ్గా అతను మాత్రం పక్కకి జరిగాడు. ఇక నిర్మత కరణ్ జోహార్ కాసేపు రణ్ వీర్ కు మేకప్ మాన్ గా చేస్తూ సందడి చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

vijay devarakonda ananya shocking the audience

Advertisement

విజయ్ దేవరకొండ గురించి లైగర్ దర్శకుడు పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ను చూడగానే అంతా వైల్డ్ అనుకుంటారని.. కానీ నిజానికి విజయ్ అలాంటి వాడు కాదన్నారు. విజయ్ ఓ సెయింట్ లాంటి వాడని.. చాలా నెమ్మదిగా ఉంటాడని పూరి చెప్పుకొచ్చారు. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఒక లయిన్ కి టైగర్ కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సర్ నా బిడ్డ” అనే రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం గూజ్ బమ్స్ మూమెంట్స్ తో అద్భుతం అనిపించింది. ముఖ్యంగా విజయ్ పాత్రకి నత్తి వుండటం బిగ్ సర్ప్రైజ్, ఛాలెంజ్. ట్రైలర్ లో లైగర్ లవ్ లైఫ్ ని కూడా అవిష్కారించారు. ‘ఐ లవ్ యూ’ అనే మాటని లైగర్ చెప్పిన విధానం అవుట్ స్టాండింగా వుంది

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి