Home » Entertainment » Vijay Devarakonda Comments On Puri Jagannadh Charmi
Entertainment

Vijay Devarakonda : పూరీని నాన్న‌గా, ఛార్మిని అమ్మ‌గా భావిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. షాక‌వుతున్న ఫ్యాన్స్

Authored By
Sam C
The Telugu News | Published on: August 16, 2022, 1:40 pm
Advertisement

Vijay Devarakonda : డాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్, అందాల భామ ఛార్మీల మధ్య ఏదో అఫైర్ న‌డుస్తుంద‌నే టాక్ కొన్నాళ్ల నుండి న‌డుస్తుంది. వీరిద్ద‌రి గురించి ఎన్ని ప్ర‌చారాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నా కూడా వారు మాత్రం స్పందించ‌డం లేదు. అయితే తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ పూరీ జ‌గ‌న్నాథ్ ని నాన్న అని ఛార్మీని అమ్మ అని అన్నారు. దీంతో వీరిద్ద‌రి వ్య‌వ‌హారం మ‌రో సారి హాట్ టాపిక్‌గా మారింది. వివ‌రాల‌లోకి వెళితే లైగ‌ర్ చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా.. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ రోజు ఇక్కడ పెద్ద ఈవెంట్ చేద్దామని అనుకున్నాం. కానీ వర్షం వల్ల ఇలా చేస్తున్నాం. ఇండియా అంతా ఇప్పుడు ప్రేమ చూపిస్తోంది. కానీ ఇదంతా కూడా ఇక్కడే మొదలైంది. మీరు ఇచ్చిన ప్రేమను తిరిగి ఇస్తా.

Advertisement

Vijay Devarakonda : స్ట‌న్నింగ్ కామెంట్స్..

సినిమా మీద ఏ డౌట్ లేదు.. బ్లాబ్లా బ్లాక్ బస్టర్. ఇండియాను మీరు షేక్ చేయాలి.. వరంగల్ మీరు షేక్ చేస్తారు.. తెలంగాణ, ఆంధ్రలో షేక్ చేయించి ఇండియా మొత్తం వినిపించాలి.. అమ్మ కొడుకు కరీంనగర్ నుంచి ముంబైకి వెళ్తారు. కొడుకుని చాంపియన్ చేయాలని అమ్మ అనుకుంటుంది. మేము కూడా హైద్రాబాద్ నుంచి బాంబేకి వెళ్లాం.. పూరి మా నాన్నలా, ఛార్మీ మా అమ్మలా, మేం ముగ్గురం బయల్దేరాం.. ఇండియాను షేక్ చేద్దామని బాంబేకి వెళ్లాం. ఇంక ఏ ఇబ్బంది వచ్చినా ఎవ్వడు అడ్డు వచ్చినా వినేది లేదని ఫిక్స్ అయ్యాం అని అన్నాడు.

vijay devarakonda comments on Puri Jagannadh Charmi

Advertisement

సినిమాకు సంబంధించి కొన్ని అనుభవాలను పంచుకున్నారు. ఈ సినిమాలో తన పాత్ర నత్తితో ఉంటుందని చెప్పాడు. ఈ పాత్రను చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నాడు. సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్నాడు. సినిమా షూటింగ్ సందర్భంగా మైక్ టైసన్ చెంపపై కొట్టిన దెబ్బకు ఒక రోజంతా నొప్పితో బాధపడినట్టు విజయ్ దేవరకొండ చెప్పాడు. బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ తో నటించడానికి ముందు కొంత ఆందోళన చెందినట్టు తెలిపాడు. రమ్యకృష్ణ గొప్పగా నటించినట్టు పేర్కొన్నాడు. లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సింగ్ క్రీడాకారుడి పాత్రలో కనిపించనున్నాడన్న సంగతి తెలిసిందే.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి