
vijay devarakonda stunning coment on Ananya Pandey
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం లైగర్. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా మూవీ రూపొందుతుంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 25న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రముఖ రియాలిటీ షో కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేశారు.
షోలో వారు చెప్పిన ప్రశ్నలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.ఇటీవల కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’లో సారా అలి ఖాన్, జాన్వీ కపూర్‌లు విజయ్‌పై మనసు పారేసుకున్నట్లు స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో విజయ్, తన ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండేతో కలిసి సందడి చేశాడు. అయితే అనన్యతో నాకు సైట్ కొట్టకు అంటూ విజయ్ క్యూట్‌గా రిక్వెస్ట్ చేసిన వీడియోను డిస్నీప్లస్ హాట్‌స్టార్ ట్విటర్‌లో షేర్ చేసింది. అందులో అనన్యతో సరదాగా తెలుగులో మాట్లాడుతూ కనిపిచాడు విజయ్.
vijay devarakonda stunning coment on Ananya Pandey
‘అనన్య నువ్వు చాలా ముద్దు పిల్లవి కానీ ఉరికే ఇట్ల నా మీద లైన్ వేయకు! వద్దు’ అంటూ అనన్యను తెలుగులో రిక్వెస్ట్ చేస్తాడు. దీనికి అనన్య పాండే.. ‘వావ్.. చాలా బాగుంది. మళ్లీ ఒకసారి చెప్పువా’ అంటూ కోరింది. దీంతో వీరిద్దరి మధ్యలో కరణ్ వచ్చి.. ‘అతను నువ్వు క్యూట్ అని చెబుతున్నాడు. కానీ తనని ఫ్లర్ట్ చేయడం ఆపమంటున్నాడు’ అని చెప్పుకొచ్చాడు. దీంతో అనన్య బుంగ మూతి పెట్టుతుంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుండగా, మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు రానున్నాయి.
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
This website uses cookies.