Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అర్జున్ రెడ్డి ఒకే ఒక్క సినిమాతో స్టార్ అయిపోయాడు.. విజయ్ ఆటిట్యూడ్ ఏ యూత్ లో క్రేజ్ ని పెంచింది. రౌడీ అని పిలుచుకునే విజయ్ ప్రస్తుత వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్తున్నాడు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తోనే రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సార్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్ గా.. సీనియర్ నటి రమ్య కృష్ణ తల్లి పాత్రలో కనిపించనుంది.
కాగా కాగా లైగర్ విడుదల కాకుండానే పూరి దర్శకత్వంలో జనగణమన టైటిల్ తో మరో భారీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు విజయ్. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోది. అలాగే దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంత హీరోయిన్ గా ఖుషి సినిమా చేస్తున్నాడు. ఇక ఇంటర్వ్యూల్లో సూటిగా మాట్లాడుతూ అన్ని విషయాలు పంచుకుంటాడు. రీసెంట్ గా బాలీవుడ్ ఫేమస్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోకి విజయ్ దేవరకొండ, అనన్య పాండే వెళ్లారు. ఈ షోలో విజయ్ పర్సనల్ విషయాలు చర్చకు రాగా విజయ్ స్టైట్ గా సమాధానాలిచ్చాడు.
అయితే క్రమంలో హోస్ట్ కరణ్ జోహార్ తాగిన మత్తులో సెట్స్ కి ఎప్పుడైనా వెళ్ళావా..? అని ప్రశ్నించాడు. దీంతో విజయ్ ఓపెన్ అయ్యాడు. ఓ సినిమా షూట్ ముందు రోజు బర్త్ డే పార్టీలో ఫుల్ గా తాగాడంట. ఆ హ్యాంగ్ ఓవర్ లో మరుసటి రోజు షూట్ కి వెళ్లాడట. అయితే అక్కడ కూడా రోల్ కోసం మళ్లీ కోసం డ్రింక్ చేశాడట. అలాగే నిజ జీవితంలో కూడా తనకు ఆల్కహాల్ అలవాటు ఉందని విజయ్ మొహమాటం లేకుండా చెప్పేసాడు. అయితే హీరోగా ఎర్లీ స్టేజిలో ఉన్న విజయ్ ఇలా తాగి షూటింగ్ కి వెళ్తే కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని అంటున్నారు. తాగి షూట్ కి వెళ్లే హీరోలు టాలీవుడ్ లో ఉన్నప్పటికీ కెరీర్ లో ఎదిగే టైమ్ లో ఇలాంటివి చేస్తే రిస్క్ అని అంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.