Home » Entertainment » Vijay Deverakonda And Rashmika Mandanna Announce The Wedding Of Virosh
Entertainment

The Wedding of VIROSH : ఎట్టకేలకు అఫీషియల్ : రష్మికతో పెళ్లిని ధృవీకరించిన విజయ్ దేవరకొండ.. ‘విరోష్’ పెళ్లి పనులు షురూ..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: February 23, 2026, 9:23 pm
Advertisement

The Wedding of VIROSH గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో, సినీ సర్కిల్స్‌లో ఎడతెగని చర్చకు దారితీసిన విజయ్ దేవరకొండ Vijay Deverakonda, రష్మిక మందన్న Rashmika Mandanna వివాహ వార్తలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఈ క్రేజీ జంట తమ బంధాన్ని అధికారికం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక హృదయపూర్వక ప్రకటన విడుదల చేశారు. తాము ఒక్కటి కాబోతున్నామని చెబుతూనే, అభిమానులు తమకు ఇచ్చిన “విరోష్” VIROSH అనే పేరునే తమ వివాహ వేడుకకు నామకరణం చేశారు.

Advertisement

The Wedding of VIROSH : ఎట్టకేలకు అఫీషియల్ : రష్మికతో పెళ్లిని ధృవీకరించిన విజయ్ దేవరకొండ.. ‘విరోష్’ పెళ్లి పనులు షురూ..!

అభిమానుల గౌరవార్థం ‘The Wedding of VIROSH’

ఆదివారం రాత్రి విజయ్, రష్మిక ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో ఒకే విధమైన పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో తమ అభిమానుల పట్ల ఉన్న కృతజ్ఞతను చాటుకున్నారు. “మాకంటూ మేము ప్లాన్స్ చేసుకోకముందే, మా గురించి మేము ఏదైనా ఎంచుకోకముందే మీరు అక్కడ ఉన్నారు. మీరు మాకు ఎంతో ప్రేమతో ‘VIROSH’ అనే పేరుని ఇచ్చారు. అందుకే ఈ రోజు మీ గౌరవార్థం మా వివాహ వేడుకకు ‘The Wedding of VIROSH’ అని పేరు పెడుతున్నాం” అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు.

Advertisement

The Wedding of VIROSH పెళ్లి ఎప్పుడు? ఎక్కడ?

అధికారికంగా షేర్ చేసిన నోట్‌లో తేదీని ప్రస్తావించనప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 26, 2026న ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా ఒక పురాతన హెరిటేజ్ ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా, కానీ అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 24న హల్దీ వేడుక, ఫిబ్రవరి 25న సంగీత్ కార్యక్రమం, ఫిబ్రవరి 26న వివాహ వేడుక Udaipur, మార్చి 4న హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ Taj Krishna జరగనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

గీత గోవిందం నుండి నిజ జీవితం వరకు

2018లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమాతో మొదలైన వీరి కెమిస్ట్రీ, ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో మరింత బలపడింది. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చినప్పటికీ, ఎప్పుడూ తాము మంచి స్నేహితులమేనని చెబుతూ వచ్చారు. అయితే గతేడాది అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థం రహస్యంగా జరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా విజయ్, రష్మిక ఈ శుభవార్తను పంచుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #VIROSH హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి