
Vijay Deverakonda liger new poster pic viral
Vijay Deverakonda : అర్జున్ రెడ్డి సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఆయన చేస్తున్న లైగర్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈసారి విజయ్ తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా పాన్ ఇండియా ప్రపంచంలో ఆ రూట్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. అయితే విజయ్ దేవరకొండ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా రాబోయే రెండు నెలల్లో సినిమాపై మరింత హైప్ పెంచే విధంగా భారీ స్థాయిలో ప్రణాళికలు రచించుకుంటున్నారు.
ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్. అందులో భాగంగా లైగర్ టీమ్ ఓ పోస్టర్‌ను వదిలింది. ఆ పోస్టర్‌లో విజయ్ బట్టలు లేకుండా దర్శనమిచ్చారు. గులాబీలను అడ్డు పెట్టుకుంటూ ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక లైగర్ హంట్ అంటూ వచ్చిన వీడియో మామూలుగా లేదన్నారు నెటిజన్స్.. వీడియోలో విజయ్ మేకోవర్ గానీ, మ్యూజిక్ గానీ ఓ రేంజ్‌లో ఉన్నాయని అంటున్నారు. భాస్కరభట్ల రవికుమార్ రాసిన ఈ పాటకు విక్రమ్ మోట్రోసే సంగీతం ఇవ్వగా.. హేమ చంద్రపాడారు. సాంగ్‌కు సోషల్ మీడియాలో అదిరే రెస్పార్స్ వస్తోంది.
Vijay Deverakonda liger new poster pic viral
కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఈ సినిమాలో ఐటెమ్ నెంబర్ ఉందట. ఈ పాటలో డాన్స్ చేసేందుకు టీమ్ ఇప్పటికే చాలా మందిని పరిశీలించారట. లైగర్ సినిమాలో బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తోంది. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.