Home » Entertainment » Vijay Varma Looking Towards Tamannah Bhatia
Entertainment

Tamannaah Bhatia : వావ్ తమన్నా.. బ్లాక్ సారీలో ఫ్రంట్ బ్యాక్ ఇరగదీసింది.. చూపు తిప్పుకోలేకపోయిన విజయ్ వర్మ .. వీడియో

Authored By
Anusha V
The Telugu News | Published on: December 13, 2023, 9:00 pm
Advertisement

Tamannaah Bhatia : టాలీవుడ్ బ్యూటీ తమన్న, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళుతుండడంతో వీళ్ళు నిజంగానే ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ తమన్నా, విజయ్ వర్మ చాలాసార్లు హింట్లు ఇస్తూ వచ్చారు. తమన్నా చాలా సందర్భాలలో తన ప్రియుడి గురించి చెప్పుకొచ్చారు. విజయ్ అంటే తనకు చాలా ఇష్టమని, నాకేం కావాలో తనకు బాగా తెలుసు అని,

Advertisement

ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు అండగా ఉంటాడని నమ్మకం ఉంది అని తమన్నా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా న్యూ ఇయర్ సందర్భంగా తమన్నా విజయవర్మ ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో వాళ్ళ ప్రేమ వ్యవహారం బయటపడింది. దీంతో అప్పటినుంచి వాళ్ల గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇక తాజాగా విజయవర్మ ,తమన్నా ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా, లీనా పెళ్లి రిసెప్షన్ కు అటెండ్ అయ్యారు. రిసెప్షన్ కు తమన్నా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. బ్లాక్ శారీలో ఫ్రంట్ బ్యాక్ అందాలతో అదరగొట్టేశారు.

విజయ వర్మ తమన్నా ఫోటోలకి ఫోజులు ఇచ్చారు. తమన్నా అందాలకు విజయ్ వర్మ కూడా చూపు తిప్పుకోలేక పోయారు. ఆమె అందాలను చూస్తూ తదేకంగా ఉండిపోయారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తమన్నా ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లకు పైనే అవుతుంది. ఆమె అందం ఇప్పటికే ఏమాత్రం చెక్కుచెదరలేదు. తన గ్లామర్ ట్రీట్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తూ వస్తుంది. సౌత్ ఇండియన్ భాషల్లో సత్తా చాటుతున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా పాత్ర పరిధిని బట్టి సినిమాలను ఎంచుకుంటున్నారు. రెమ్యూనరేషన్ బాగా డిమాండ్ చేస్తూ స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్నారు.

Anusha V

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి