
Vijaya Rangaraju : ప్రముఖ నటుడు, భైరవ ద్వీపం నటుడు విజయ రంగరాజు ఆకస్మిక మరణం
Vijaya Rangaraju : ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ గురించి సినీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చాలా సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించారు.ఆయన ఆకస్మిక మరణం చెందారు. చెన్నైలో ఓ ప్రవేట్ హాస్పిటల్‌లో ఆయన గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్ Hyderabad లో ఒక సినిమా షూటింగ్ లో గాయపడ్డ విజయ రంగరాజు ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ హార్ట్ అటాక్‌తో మరణించారు. రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు, తమిళ సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లో అలరించారు రంగరాజు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సీతా కళ్యాణం’ రంగరాజుకు నటుడిగా ఫస్ట్ మూవీ. అయితే నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చింది .
Vijaya Rangaraju : ప్రముఖ నటుడు, భైరవ ద్వీపం నటుడు విజయ రంగరాజు ఆకస్మిక మరణం
కెరీర్ టర్నింగ్ చిత్రం ‘భైరవ ద్వీపం’ చిత్రం. ఈ సినిమాలో నటనకుగాను మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత విజయ రంగరాజు కెరీర్ సెకండ్ టర్నింగ్ పాయింట్ అంటే ‘యజ్ఞం’ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో విలన్‌గా అదరగొట్టిన ఆయన, ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించారు. కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్‌లో రంగరాజుకు ప్రావీణ్యం ఉంది. విజయ రంగరాజు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. కెరీర్‌ను స్పోర్ట్స్‌లో ప్రారంభించారు. తర్వాత నటన మీద ఆసక్తితో మద్రాసులోని రంగస్థల కళాకారునిగా చేశారు.
స్టేజ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు వియత్నాం అనే మలయాళ సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. మోహన్ లాల్ హీరోగా చేసిన ఈ సినిమాలో విజయ రంగరాజు విలన్‌గా చేశారు. తర్వాత తెలుగులో 1994లో భైరవద్వీపంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. బాలయ్య హీరోగా చేసిన ఈ సినిమా తెలుగులో మంచి హిట్‌ని అందుకుంది. భైరవ ద్వీపం భారీ హిట్‌గా నిలిచినా.. విజయ రంగారాజుకు అవకాశాలు దక్కలేదు. తర్వాత మగరాయుడు అనే సినిమాలో నటించారు. తర్వాత కొన్ని సినిమాల్లో నటించి బ్రేక్ తీసుకున్నారు. గోపిచంద్ హీరోగా నటించిన యజ్ఞం సినిమాలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత చేసిన ఢమరుకం, బ్యాండ్ బాజా సినిమాల్తో కూడా మంచి గుర్తింపు వచ్చింది.విజయ రంగరాజు నటనలోకి రాకముందు వెయిట్ లిఫ్టింగ్ కూడా చేశారు. బాడీ బిల్డింగ్ పోటీల్లోనూ పాల్గొన్నారు. విశాఖ ఎక్స్ ప్రెస్, ఢమరుకం, బ్యాండ్ బాజా,శ్లోకం` చిత్రాలతో ఆకట్టుకున్నారు విజయ రంగ రాజు.
School Holidays : తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన కీలక సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చింది.…
CM Revanth Reddy Uppal : హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. ముఖ్యంగా నగర…
Miyapur : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం మియాపూర్‌లో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
Gachibowli : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకున్న యువతి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కో-లివింగ్ హాస్టల్‌లో నివసిస్తున్న…
Hanuman Nagar Colony Association : ఉప్పల్ జూన్ 7 : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ…
Farmers : వ్యవసాయం అంటే చాలా మందికి ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలే గుర్తుకు…
LPG Gas Cylinder : దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్న తరుణంలో,…
Bigg Boss Telugu 10 : తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్ తెలుగు’…
Pawan Kalyan NDA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ,…
41st Wedding Anniversary : సాధారణంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కూలీలు ఎండను తట్టుకుంటూ కష్టపడి పనిచేస్తుంటారు. రోజువారీ శ్రమ…
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
This website uses cookies.