Ram Charan : టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి.. ఆ తర్వాత చెప్పాలి : రామ్ చరణ్
ప్రధానాంశాలు:
Ram Charan : టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి.. ఆ తర్వాత చెప్పాలి: రామ్ చరణ్
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా Global star పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు.ఆర్ఆర్ఆర్ తర్వాత ram charan రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ ఛేంజర్.ఈ సినిమా తొలి రోజు నుండి నెగటివ్ టాక్ అందుకుంది. అయితే రామ్ చరణ్ Ram Charan ఇటీవల బాలయ్య గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కి హాజరు కాగా, ఇందులో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శర్వానంద్ sharwanand , విక్కీ, రామ్ చరణ్ త్రయం అల్లరిని చూసి బాలయ్య Balakrishna కూడా షాక్ అయ్యాడు. ఈ ముగ్గురూ ఇంత అల్లరి చేస్తారా? అని బాలయ్య కూడా ఆశ్చర్యపోయాడు. శర్వా అయితే బాలయ్యకే సెటైర్లు వేస్తూ అందరినీ నవ్వించాడు. సుష్మిత, శ్రీజల నుంచి ఓ వీడియో బైట్ కూడా వచ్చింది…
Ram Charan: కాలమే సమాధానం చెబుతుంది
రామ్ చరణ్ ram charanను సుష్మిత ఓ కోరిక కూడా కోరింది. ఈ ఏడాది కచ్చితంగా తమను ట్రిప్‌కు తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. బాలయ్య షో సాక్షిగా రామ్ చరణ్ సైతం మాట ఇచ్చేశాడు. అంటే ఈ ఏడాది రామ్ చరణ్, సుష్మిత, శ్రీజ బయటకు వెకేషన్ కోసం వెళ్తారని ఫిక్స్ అయిపోవచ్చు. ఇక రామ్ చరణ్‌ను బాలయ్య BalaKrishna ఓ పర్సనల్ ప్రశ్న వేశాడు. ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు, జీవితంలో అనుకోని ఘటనలు, బాధ పడే విషయాలు చోటు చేసుకున్నప్పుడు వాటి నుంచి ఎలా బయటకు వస్తావు అని అడిగాడు బాలయ్య. దానికి రామ్ చరణ్ చాలా గొప్ప సమాధానాన్ని ఇచ్చాడు. జీవితంలో మనకు జరిగే ప్రతీ ఒక్కటి ఓ అనుభవమే.. తప్పులు అందరం చేస్తూనే ఉంటాం.. కానీ చేసిన తప్పే మళ్లీ చేయకూడదు..
అన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది.. ఓ యాక్షన్ జరిగింది కదా.. అని వెంటనే రియాక్షన్ ఇవ్వాల్సిన పని లేదు.. కాస్త వెయిట్ చేస్తే.. టైం ఇస్తే.. అన్నీ సెట్ అవుతాయి.. మన టైం వచ్చే వరకు ఆగాలి.. ప్రతీ రోజూ మనది కాకపోవచ్చు.. అన్ని రోజులు మనకు కలిసి రావు అనే నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి.. పెద్దల సలహాలు, సూచనలు వింటూ ముందుకు వెళ్తుండాలి.. బాధలు కలిగాయని, ఫెయిల్యూర్స్ వచ్చాయని బాధపడకూడదు.. నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి.. కాస్త బాధపడి వదిలేయాలి.. దేనికీ ఎక్కువగా కుమిలిపోయి బాధపడకూడదు.. నా చుట్టూ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఉంటారు.. వాళ్లే నా బలం.. నేను ఒంటరిని అయ్యాను అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉండదు.. అని రామ్ చరణ్ Ram Charan అద్భుతంగా చెప్పుకొచ్చాడు.