
Vishnu Priya: విష్ణుప్రియ భీమనేని.. గత కొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ ముద్దుగుమ్మ. నటిగా, యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది ఈ అందాల భామ. మోడలింగ్ రంగం నుండి బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. విష్ణుప్రియ భీమనేని టీనేజ్‌లో ఉన్నప్పుడే ‘చెక్‌మేట్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సి వచ్చింది. కానీ, ఈ మూవీ అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, గత ఏడాది ఇది ఓటీటీలో నేరుగా రిలీజ్ అయింది. అందులో ఈ బ్యూటీ అందాలు ఆరబోయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రెచ్చిపోయింది. అలాగే బికినీలోనూ దర్శనమిచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి మంచి స్పందన దక్కింది.
చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసింది. ఈ క్రమంలోనే దగ్గుబాటి రానా ‘నెంబర్ నవ్ యారీ’ షోలో పని చేసింది. దీని తర్వాత విష్ణుప్రియ చాలా కార్యక్రమాలకు తెర వెనుక ఉండి పని చేసింది. సుడిగాలి సుదీర్ తో జోడిగా చేసిన సోవే పోరా గేమ్ షో ద్వారా క్రేజ్ అందుకున్న విష్ణుప్రియ ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేసింది. ఇటీవల ఓ మూవీ ప్రకటించారు విష్ణు ప్రియ. ఆ మూవీలో ఆమె హీరోయిన్ గా నటిస్తుండగా… చాలా ఆనందం వ్యక్తం చేశారు. హీరోయిన్ గా నటించాలనే నా కల తీరకుండానే చచ్చిపోతానేమో అని భయం వేసిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే విష్ణు ప్రియ కొద్ది రోజులుగా కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంది.
వరుస ఫొటో షూట్స్‌తో కిక్కిస్తుంది. అయితే విష్ణు ప్రియ ఇంత స్లిమ్‌గా ఉండడం వెనక చాలా కష్టం ఉందని తాజా వీడియోతో తెలియజేసింది. తాజా వీడియోలో విష్ణు ప్రియ తల కిందుకు కాళ్లు పైకి పెట్టి ఆసనాలు చేసింది. అలానే భారీగా బరువులు ఎత్తి ఆశ్చర్యపరచింది. విష్ణు ప్రియ కష్టాలు మాములుగా లేవంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత స్లిమ్‌గా, అందంగా ఉండడం వెనక ఇంత కష్టం ఉందా అంటున్నారు. విష్ణుప్రియ భీమనేని.. వారం రోజులుగా ఎన్నో రకాల హాట్ ఫొటోషూట్లను చేసింది. ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి వైరల్ అయ్యాయి. చూస్తుంటే రానున్న రోజులలో విష్ణు ప్రియ నుండి మరిన్ని అప్‌డేట్స్ రానున్నట్టు తెలుస్తుంది.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.