
vishwak sen fire on tv 9 anchor
Vishwak Sen : టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం. బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్నారు. ఖమ్మం .. లేక్ వ్యూ క్లబ్ లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. మొదటి నుండి ఈ సినిమా ప్రమోషన్స్ వినూత్నంగా సాగుతున్నాయి.
రీసెంట్‌గా ఓ వ్యక్తితో విశ్వక్ చేసిన ఫ్రాంక్ వీడియో ఇప్పుడు హట్ టాపిక్‌గా మారింది.విశ్వక్ సేన్ పై అడ్వకేట్ అరుణ్ కుమార్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. నిన్న పెట్రోల్ డబ్బాతో అభిమానిని సూసైడ్ చేసుకునేలా ప్రాంక్ వీడియో చేసిన విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్, పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కోన్నారు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్స్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరారు. ఇక ఈ విషయం గురించి మాట్లాడేందుకు విశ్వక్ సేన్ టీవీ 9 స్టూడియోకి వెళ్లగా, అక్కడ టీవీ 9 యాంకర్‌కి విశ్వక్ మధ్య పెద్ద ఫైట్ నడిచింది.
vishwak sen fire on tv 9 anchor
విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘ నాకు మీరు పాగల్ శీను అనే పేరు పెట్టారు. నేను కూడా మీపై పరువు నష్టం దావా వేయొచ్చు. కానీ నేను అలా చేయను. మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడండి డిప్రెషన్ పర్సన్ అని, పాగల్ శీను అని అనడం సరికాదు’’ అని అన్నారు. విశ్వక్ సేన్ అలా రియాక్ట్ కావడంతో స్టూడియో నుంచి బయటకు వెళ్లిపో గట్టిగా వార్నింగ్ ఇచ్చింది టీవీ 9 యాంకర. దానికి విశ్వక్ సేన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘యు ఫ** గయ్స్ కాల్డ్ మీ’’’ అంటూ విశ్వక్ యాంకర్‌పై విరుచుకు పడ్డాడు. దీంతో సహనం కోల్పోయిన యాంకర్ ‘యు గెటవుట్ ఫస్ట్ ఫ్రమ్ స్టూడియో’ అంటూ పదే పదే చెప్పడంతో ‘నేను బయటకు పోతే నా గురించి ఇష్టమొచ్చినట్లు చెబుతారు.. యు జస్ట్ షటప్’ అనేసి విశ్వక్ సేన్ స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోయారు.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.