Nagarjuna : ఆరు పదుల వయసు దాటినా కానీ ఏ మాత్రం ఫిట్ నెస్ కోల్పోకుండా మెయింటేన్ చేస్తూ వస్తున్నాడు కింగ్ నాగార్జున. ఆయన ఇప్పటికీ అమ్మాయిల గుండెల్లో మన్మధుడే. కానీ ఈ మధ్య నాగార్జున కు టైం అస్సలు బాగున్నట్లుగా కనిపించడం లేదు. తన పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్య కోడలు సమంతల విడాకుల దగ్గరి నుంచి నాగ్ కు షాక్ లు వరుస పెట్టి తగులుతున్నాయి. ఇక నాగార్జున సినీ కెరీర్ కూడా అనుకున్నంత జోష్ లో లేదనే చెప్పాలి.ఆయన హిట్ మాట విని దాదాపు 10 సంవత్సరాలు అవుతోంది.
అప్పుడెప్పుడో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా తర్వాత నాగ్ కు సరైన హిట్ పడలేదు. హిట్టు కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్న నాగ్ కు ఇప్పుడు కొత్త టెన్షన్ వచ్చి పడిందని ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న నాగార్జున ఈ టెన్షన్ నుంచి ఎలా బయటపడతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నాగ్ సినీ కెరీర్ లో చివరగా హిట్ అనిపించుకున్న సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు నాగ్ ప్రస్తుతం సీక్వెల్ నిర్మిస్తున్నాడు.
ఆ సినిమాలో నటించిన రమ్యక్రిష్ణతో పాటు రీసెంట్ బ్యూటీ కృతి శెట్టి కూడా ఈ సినిమాలో నటిస్తోంది. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాలో చై కూడా నటించడం గమనార్హం. ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిసి నాగ్ సొంత నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు బడ్జెట్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అయిపోతుందని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారట. మార్కెట్ పరంగా చూసినా కూడా ఇంత బడ్జెట్ తో సినిమా తీస్తే అసలే హిట్లు లేని నాగ్ సినిమాకు లాభాలు వస్తాయా అని సందేహంలో ఉన్నారట. ఈ విషయంలోనే నాగ్ చాలా టెన్షన్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.