Home » Entertainment » Where Is Master Vijay Devarakonda In Maldives
Entertainment

Vijay Devarakonda : మాల్దీవ్స్ లో మేడం ఒక్కరే కనిపిస్తున్నారు… మాస్టారు విజయ్ దేవరకొండ ఎక్కడ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: October 12, 2022 8:19 pm
Advertisement

Vijay Devarakonda : ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఎక్కడ ఉన్నాడు అంటే టక్కున వినిపించే సమాధానం మాల్దీవ్స్. అవును.. ప్రస్తుతం అతడు మాల్దీవ్స్ లో హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ గురించి పక్కన పెడితే రష్మిక మందన ప్రస్తుతం ఎక్కడ ఉంది అనే ప్రశ్నకు సమాధానం కూడా అదే మాల్దీవ్స్ అంటూ సమాధానం వినిపిస్తుంది. ఆమె మాల్దీవ్స్ లో ఉన్నాను అంటూ తన ఫొటోస్ మరియు వీడియోస్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి మరీ క్లారిటీ ఇస్తుంది. ఇద్దరూ కలిసి వెళ్లారా లేదా అనే అనుమానం కొద్ది మందిలో ఇంకా ఉంది. ఆ కొద్ది మంది అనుమానం నివృత్తి అయ్యే అవకాశం లేదు కానీ.. సోషల్ మీడియాలో ప్రస్తుతం వీళ్ళు షేర్ చేస్తున్న ఫొటోస్ మరియు వీడియోస్ ఆసక్తికర ప్రశ్నలను రేపుతున్నాయి.

Advertisement

రష్మిక మందన తాజాగా మాల్దీవ్స్ ల్లో సముద్రపు అందాలని ఎంజాయ్ చేస్తూ తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఎక్కడా కూడా విజయ్ దేవరకొండ కనిపించడం లేదు, దాంతో మేడం ఒక్కరే కనిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఎక్కడ అంటూ పదే పదే సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన కలిసి ఎయిర్పోర్ట్ కి రాకుండా కలిసి విమానం ఎక్కి మాల్దీవ్స్ కి వెళ్లారు. వారిద్దరే వెళ్లారా లేదంటే స్నేహితులు కూడా వారి వెంట ఉన్నారా అనే విషయంపై క్లారిటీ రాలేదు, కానీ రకరకాలుగా వీరిద్దరి యొక్క హాలిడే ట్రిప్ గురించి ప్రచారం జరుగుతుంది. ఒక ప్రముఖ మీడియా సంస్థ ఏకంగా ప్రీ వెడ్డింగ్ హనీమూన్ అంటూ వీరి హాలిడే ట్రిప్పు కి పేరు పెట్టేసింది.

Where is Master Vijay Devarakonda in Maldives

Advertisement

పెళ్లికి ముందు ఇలా హనీమూన్ కి వెళ్లడం ఏంటి రా బాబు అంటూ కొందరు ముక్కున వేలు వేసుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం విజయ్ దేవరకొండ లక్కీ ఫెలో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన వ్యవహారం ఏంటో తెలియట్లేదు కానీ వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందనేది మాత్రం బలంగా అందరూ నమ్ముతున్నారు, వీరిద్దరి కాంబినేషన్లో త్వరలో మరో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. గీత గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. డియర్ కామ్రేడ్ మంచి విజయాన్ని అందుకోలేక పోయింది. దాంతో కంటిన్యూ అవ్వలేదు. వీరిద్దరి కాంబోలో మరో సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నామంటున్నారు ఆ సినిమాతో వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై మరింత క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి