who is the host for Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu : తెలుగులో సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం తెలుగులో ఆరు సీజన్స్ పూర్తి చేసుకుంది. విదేశాలలో మొదలైన ఈ షో ముందుగా హిందీలోకి వచ్చింది. ఆ తర్వాత పలు ప్రాంతీయ భాషలలోకి వచ్చింది. తెలుగులో కూడా 2017 వ సంవత్సరంలో ఈ షోల పరంపరను తీసుకు రాగా, మొదటి సీజన్ ని జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా రెండో సీజన్ ని హీరో నాని హోస్ట్ చేశారు, ఆ తర్వాత నుంచి వరుసగా నాగార్జున హోస్ట్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే . మూడో సీజన్ నుంచే నాగార్జున ఈ బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండగా, సీజన్ 6 వరకు ఆయననే ఉన్నారు. అయితే నాగార్జున బిగ్ బాస్ సెవెన్ హోస్ట్ గా ఉండడం లేదని,
ఆయన హోస్ట్ స్థానం నుంచి తప్పుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. నాగార్జున హోస్ట్‌గా తప్పుకుంటే ఆయన స్థానంలో హోస్ట్‌గా ఎవరు ఉంటారు అనే చర్చ నడుస్తుంది. టాలీవుడ్ కు చెందిన ఒక యువ హీరో ఈసారి హోస్ట్ గా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ అని ప్రచారం జరిగింది. కానీ ఆయన కాదు..వేరే హీరో సీన్ లోకి వచ్చారంటున్నారు. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నాగార్జున ప్లేస్ లోకి ఇప్పుడు మరో యూత్ లోక్రేజ్ ఉన్న రానా వస్తాని ప్రచారం జరుగుతంది. నెంబర్ వన్ యారి కి హోస్ట్ గా ఆకట్టుకున్న రానా అయితే బిగ్ బాస్ హోస్ట్‌గా ఉంటారని అంటున్నారు.
who is the host for Bigg Boss 7 Telugu
ఈ క్రమంలో రానా… కొత్త ప్రాజెక్ట్ లు ఒప్పుకోవడం లేదని అంటున్నారు. ఇక యువ హీరో విజయ్ దేవరకొండ ఈసారి హోస్ట్ గా వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇందులో క్లారిటీ లేదు. మరోవైపు అన్‌స్టాపబుల్ షోతో అదరగొడుతున్న బాలయ్య .. బిగ్ బాస్ షోని హోస్ట్ చేయనున్నాడనే ప్రచారం కూడా నడుస్తుంది. మరి ముగ్గురిలో ఎవరు హోస్ట్‌గా ఉంటారో, వీరు కాకుండా నాగార్జుననే వచ్చే సీజన్‌కి హోస్ట్‌గా ఉంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. బాలయ్య అన్ స్టాపబుల్ షో ని ఓ రేంజ్ లో పైకి లేపాడు బాలయ్య . ఇదే క్రమంలో బాలయ్య బిగ్ బాస్ సీజన్ సెవెన్ హోస్టుగా చేస్తే కచ్చితంగా ఇన్ని సీజన్స్ కి మించి పోయే టీఆర్పీలు రావడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
This website uses cookies.