Vijay: తమిళ స్టార్ హీరోలు ఇప్పుడు మన టాలీవుడ్ మీద దండ యాత్ర చేసేందుకు ట్రై చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్స్‌గా వెలుగుతున్న సీనియర్ హీరోలు సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వ నటుడు కమల్ హాసన్ ఇప్పుడు తెలుగులో స్ట్రైట్ సినిమా చేయాలనే ఆరటం లేదు గానీ, ఈ జనరేషన్ హీరోలు మాత్రం మన టాలీవుడ్ మార్కెట్ మీద పట్టు సాధించేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తమిళ హీరోలు తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు.
వారిలో తలపతి విజయ్, ధనుష్, శివ కార్తికేయన్ ముందు వరుసలో ఉన్నారు. ఇంకా సూర్య, కార్తి, అజిత్ ఆ ఆలోచన చేయడం లేదు. తలపతి విజయ్ తెలుగులో ఎంట్రీ ఇస్తూ దిల్ రాజు నిర్మాణంలో ఓ పాన్ ఇండియన్ సినిమాను చేయబోతున్నా డు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వంవహిస్తారు. ఇప్పటికే, ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా కూడా ప్రకటించారు. శివ కార్తికేయన్ తెలుగులో చేస్తున్న స్ట్రై మూవీకి జాతి రత్నాలు ఫేమ్ కెవి అనుదీప్ దర్శకత్వం వహించనున్నాడు. అలాగే, సితార బ్యానర్‌లో ధనుష్ ఒక సినిమాను చేస్తున్నాడు. సార్ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
అయితే, ఇప్పుడు ఈ హీరోలతో తెలుగులో ప్రాజెక్ట్స్ వర్కౌట్ అవుతాయా అని సందేహాలు మొదలయ్యాయి. దానికి కారణం విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా బీస్ట్. అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బీస్ట్ అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అసలే విజయ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఆదరణ అంతంత మాత్రం. ఇప్పుడు బీస్ట్ కూడా ఫ్లాపవడంతో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా విషయంలో పలు కొత్త సందేహాలు మొదలయ్యాయి. విజయ్ మార్కెట్‌కు తగ్గట్టు దిల్ రాజు సినిమా నిర్మిస్తే ఇక్కడ వర్కౌట్ అవుతుందా. ఒక రకంగా ఇది మేకర్స్ చేస్తున్న పెద్ద సాహసం అని చెప్పుకుంటునారు. మొత్తానికి బీస్ట్ ఎఫెక్ట్ విజయ్ తెలుగు డెబ్యూ మూవీపై గట్టిగానే పడిందంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.