Karthika Deepam : జ్వాలకు అసలు నిజం హిమ చెప్పేస్తుందా? తింగరే హిమ అని జ్వాల గుర్తుపడుతుందా? తింగరిపై జ్వాల ప్రతీకారం తీర్చుకుంటుందా?

Advertisement
Advertisement

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ 1323, 11 ఏప్రిల్ 2022 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా జీవితాన్ని తలకిందులు చేసిన నా శత్రువును నేను అస్సలు వదలను అని జ్వాల అంటుండగా హిమ వింటుంది. విని.. బాధపడుతుంది. ఇంతలో అక్కడి నుంచి హిమ వెళ్తుండగా జ్వాల చూసి చెప్పాపెట్టకుండా వెళ్తున్నావేంటి అని అడుగుతుంది. దీంతో హిమకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో జ్వాలకు ఏం చేయాలో అర్థం కాదు.

Advertisement

will hima reveals the truth to shourya in karthika deepam

ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి శౌర్య కనిపించింది అని తన డాడీ, మమ్మీ ఫోటో ముందు చెబుతుంది. ఈ జన్మకు ఇది చాలు దేవుడా అనుకున్నాను కానీ.. శౌర్య దగ్గరికెళ్లి గట్టిగా హత్తుకొని నేనే నీ హిమను అని చెప్పాలనిపించింది కానీ.. చెప్పలేని పరిస్థితి అంటుంది హిమ. చిన్నప్పుడు నా మీద శౌర్యకు ఉన్నకోపం ఇప్పుడు వెయ్యి రెట్లు పెరిగింది. ఇప్పుడు ఏం చేయాలి. నా పేరు ఎత్తితేనే శౌర్య భగభగమండిపోతోంది అని అంటుంది హిమ. నా మీద శౌర్యకు ఎంత ప్రేమ ఉండేదో.. నన్ను ఎంత బాగా చూసుకునేదో.. ఇప్పుడు ప్రేమ మొత్తం ద్వేషంలా మారిపోయింది అని అంటుంది హిమ.

Advertisement

నేను చేసిన తప్పుకు ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఏడుస్తూనే ఉన్నాను. ప్రాయశ్చిత్తం లేని ఘోరమైన తప్పు చేశాను అని అంటుంది హిమ. మీ చావుకు నేనే కారణం అయిపోయాను అంటుంది హిమ. ఆ కోపంతోనే శౌర్య నాకోసం ఎదురు చూస్తోంది డాడీ అంటుంది హిమ.

శౌర్య మనసులో ఉన్న కోపాన్ని పోగొట్టేలా చేసుకోవడమే నా ముందున్న లక్ష్యం. ఏం చేసి అయినా.. ఎలాగైనా శౌర్య నన్ను క్షమించేలా చేసుకుంటాను అని అంటుంది హిమ. చిన్నప్పుడు మీకు నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను మమ్మీ అంటుంది హిమ.

Karthika Deepam : సౌందర్యపై స్వప్న సీరియస్

తను అసలే హార్ట్ పేషెంట్. తనను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. శౌర్య నేనే హిమను.. ఈ తింగరే నీ తింగరి అని.. నీ హిమను అని చెప్పాలి. మేమిద్దరం సంతోషంగా ఉండాలి. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను అమ్మ అంటుంది హిమ.

డాడీ చిన్నప్పుడు అమ్మ వంటలు చేస్తూ కష్టపడ్డట్టుగానే.. ఇప్పుడు శౌర్య కూడా ఆటో నడుపుతోంది. టిఫిన్ బాక్సులు అందిస్తోంది. కష్టపడుతోంది డాడీ. శౌర్య కష్టపడటానికి.. తను ఇబ్బందులు పడటానికి కారణం నేనే కదా అని అంటుంది హిమ.

తనకు ఇక నుంచి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అంటుంది హిమ. పిచ్చిదాన్ని.. శౌర్యను నేను కాపాడుకోవడం ఏంటి.. తనే నన్ను కాపాడింది. తింగరి అలా ఉండు.. తింగరి ఇలా ఉండు అని నేను ఎవరో తెలియకపోయినా నన్ను నడిపిస్తోంది. అమ్మ, డాడీ నన్ను దీవించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది హిమ.

మరోవైపు సౌందర్య.. ఆనంద రావును చూడటానికి వస్తుంది. ఇంతలో స్వప్న వచ్చి డాడీ ఇలాంటివే వద్దు అన్నాను కదా అంటుంది. ఆవిడను ఎందుకు రమ్మన్నావు అంటుంది. ఏయ్ ఏంటే నువ్వు మాట్లాడేది.. పంతంలో నేను నీకంటే తక్కువేం కాదు అంటుంది సౌందర్య.

ఆ తర్వాత నిరుపమ్ వస్తాడు. మళ్లీ స్వప్న, సౌందర్య మధ్య గొడి పెద్దది అవుతుంది. మరోవైపు హిమనే ఎక్కువగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది జ్వాల. ఏమైంది.. ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది చంద్రమ్మ. గలగలా మాట్లాడే నువ్వు ఏం మాట్లాడకుండా కూర్చున్నావు కదా అని అంటుంది చంద్రమ్మ.

మరోవైపు ఇంద్రుడు స్టీల్ గ్లాస్ లో నీళ్లు తాగుతుంటే గ్లాస్ ను పక్కన పడేస్తుంది. అందులో మందు ఉంటుంది. స్టీల్ గ్లాస్ లో మందు తాగుతున్నావా అని అడుగుతుంది. ఎందుకు బాబాయి నువ్వు మందు తాగుతున్నావు అని అడుగుతుంది జ్వాల.

చేసిన పాపాలు మరిచిపోవడానికి.. పోయిన పాపను మరిచిపోలేక తాగుతున్నానమ్మ అంటాడు ఇంద్రుడు. దీంతో చనిపోవడానికి ముందు రోజు కూడా మా అమ్మానాన్నలు ఇలాగే మందు తాగారు.. డ్యాన్సులు చేశారు. అదే వాళ్లకు చివరి డ్యాన్స్ అయింది అని అంటుంది జ్వాల.

ఇంతలో హిమ.. అక్కడికి వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అంటుంది. ఇంద్రుడు, చంద్రమ్మను చూసి షాక్ అవుతుంది హిమ. మంచి మనుషుల దగ్గరికే శౌర్యను చేర్చావా దేవుడా అని అనుకుంటుంది హిమ. ఫ్రూట్స్ పట్టుకొని వస్తుంది తింగరి.

తర్వాత తన ఇంట్లో భోజనం చేస్తుంది హిమ. నీకు నచ్చిన కూర ఏంటి అని అడుగుతుంది శౌర్య. దీంతో దోసకాయ పచ్చడి అంటుంది హిమ. దీంతో నాకు అదంటే ఇష్టం ఉండదు అంటుంది శౌర్య. నీకు ఎందుకు ఇష్టం ఉండదు అని అడుగుతుంది.

దీంతో నాకు నచ్చని వాళ్లకు ఆ పచ్చడి అంటే ఇష్టం.. అందుకే నాకు నచ్చదు అంటుంది. తర్వాత తింగరి అన్నం తింటుండగా అదేం తినడం.. ఇలా కూర కలుపుకొని తినాలి అని తనకు తినిపిస్తుంది జ్వాల. దీంతో కన్నీరు పెట్టుకుంటుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Sleep : నిద్ర కూడా లివర్ ను దెబ్బతీస్తుంది అంటే నమ్ముతారా… అవునండి ఇది నిజం… పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు ఏమిటంటే…??

Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…

56 mins ago

Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం : అర్హత, ప్రయోజనాలు

Free Gas Cylinder : ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తోంది. టిడిపి, జనసేన మరియు…

2 hours ago

Yoga : ఆఫీసుల్లో గంటలు తరబడి పని చేసేవారు చేయవలసిన యోగాసనాలు ఇవే…!

Yoga : ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ చేసే ఉద్యోగం కంటే ఆఫీసులో ఒకే చోట కూర్చొని పనిచేస్తూ ఎక్కువ…

3 hours ago

RRB NTPC Recruitment : 11558 ఖాళీల కోసం దరఖాస్తుల ఆహ్వానం..అర్హత & చివరి తేదీ..!

RRB NTPC Recruitment : RRB రైల్వే నాన్-టెక్నికల్ పాపులర్ (NTPC) కేటగిరీల మొత్తం 11,558 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను…

4 hours ago

Zodiac Signs : సెప్టెంబర్ 24 25 తర్వాత ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు…ఇక నుండి పట్టిందల్లా బంగారమే..!

Zodiac Signs : సెప్టెంబర్ నెల 24, 25వ తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అలాగే అదే రోజు…

5 hours ago

Bay Leaf Water : బే ఆకులతో కూడా బరువుని ఈజీగా తగ్గించుకోవచ్చు… ఎలాగంటే…?

Bay Leaf Water : ప్రస్తుత కాలంలో బిర్యానీ నుండి నాన్ వెజ్ వంటకాల వరకు బే ఆకులను ప్రతి…

6 hours ago

Pitru Paksha : పితృపక్ష సమయంలో మగవారు ఈ తప్పులు చేస్తే ఇక అంతే… చాలా నష్టపోతారు…!

Pitru Paksha : హిందూ సనాతన ధర్మంలో ఏడాదిలోని ఒక నిర్దిష్ట కాలాన్ని పూర్వికులకు అంకితం చేయబడింది. ఈ కాలాన్ని…

7 hours ago

Canara Bank : కెనరా బ్యాంక్ 3,000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!

Canara Bank : కెనరా బ్యాంక్ 3,000 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ…

8 hours ago

This website uses cookies.