will janaki and rama chandra stay in cottage only in janaki kalaganaledu
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 28 మార్చి 2022, ఎపిసోడ్ 266 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది నానమ్మ నాకు రాసిచ్చిన స్థలం. ఇక్కడ నాకు ఉండే హక్కు ఉంది. నేను ఇక్కడి నుంచి కదలను అని ఖరాఖండిగా రామా జ్ఞానాంబకు చెప్పడంతో ఏం చేయాలో జ్ఞానాంబకు అర్థం కాదు. మా నానమ్మ ఇచ్చిన స్థలంలో ఉండే హక్కు నాకు లేదా అమ్మా అంటాడు రామా. దీంతో అవును.. సూపర్ కరెక్టే అంటాడు గోవింద రాజు. ఇన్ని రోజులు నువ్వు మన అనేవాడివి.. ఇప్పుడు నా అంటున్నావంటే.. నువ్వేంటో.. అర్థం అయింది. నీతో ఎవరు మాట్లాడిస్తున్నారో కూడా నాకు అర్థం అయింది అంటుంది జ్ఞానాంబ.
will janaki and rama chandra stay in cottage only in janaki kalaganaledu
మీరు ఎలా ఇక్కడ ఉంటారో చూస్తా అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మల్లికకు కూడా ఏం చేయాలో అర్థం కాదు. వీళ్లను ఇంట్లో నుంచి వెళ్లగొడదామంటే వీళ్లేమో ఇంట్లో నుంచి వెళ్లిపోవడం లేదు అని బాధపడుతుంది. తన ప్లాన్ అంతా రివర్స్ అయిందని అనుకుంటుంది. మరోవైపు అత్తయ్య గారు.. అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వేంటి మాకు చెప్పేది.. అన్నట్టుగా ఇంటి బయటే టెంట్ వేశారు అంటుంది మల్లిక. మీరు ఇలాగే ఉన్నారంటే మెల్లగా టెంట్ లో నుంచి ఇంట్లోకి వస్తారు. అందుకే మీరు పరువు గోదాట్లో కొట్టుకుపోకుండా ఉండాలంటే మీరు ఊ అనండి అత్తయ్య గారు.. నేను వాళ్లను అక్కడి నుంచి పంపించేస్తాను అంటుంది మల్లిక.
దీంతో గోవింద రాజు.. వాళ్లను అక్కడి నుంచి ఎవ్వరూ పంపించలేరు అంటాడు. ఈ ఇంటికి మీరే కోర్టు.. మీరు జడ్జి అంటుంది మల్లిక. కానీ.. జ్ఞానాంబ ఏం మాట్లాడదు. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఏం చేయాలో మల్లికకు అర్థం కాదు.
మరోవైపు జానకి.. కట్టెల పొయ్యి మీద వంట వండుతూ ఉంటుంది. మీకు చాలా కష్టాలు తీసుకొచ్చాను. నన్ను క్షమించండి జానకి గారు అని మనసులో అనుకుంటాడు రామా. రామా గారు.. మీరు ప్రతిక్షణం నాగురించే ఆలోచిస్తూ బాధపడుతున్నారని నాకు అర్థం అవుతోంది.
కానీ.. మిమ్మల్ని ఆ బాధ నుంచి ఎలా బయటికి తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. ఏమండోయ్ శ్రీవారు.. మీరు ఇష్టంగా తినే ఉప్మా తయారు చేశాను. మీరు వెళ్లి చేతులు కడుక్కొని వస్తే చకచకా తినేద్దాం అంటుంది జానకి.
దీంతో రామా తనను అలాగే చూస్తూ ఉంటాడు. ముందు టిఫిన్ సంగతి చూద్దాం. మీరు వెళ్లి కాళ్లు చేతలు కడుక్కొని రండి అంటుంది జానకి. మా ఆయన బంగారం అంటుంది జానకి. నన్ను కళ్లలో పెట్టుకొని చూసుకుంటారు అంటుంది. మరి ఇలా కన్నీళ్లు పెట్టుకోవచ్చా అంటుంది.
ఒక చిన్న అపార్థం మన ఇంటి నుంచి మనల్ని దూరం చేసింది. త్వరలోనే అత్తయ్య గారు మనల్ని అర్థం చేసుకుంటారు. మనల్ని చేరదీస్తారు అంటుంది జానకి. ముందు నేను చేసిన ఉప్మా ఎలా ఉందో చెప్పండి అని అడుగుతుంది జానకి. తినమని చెబుతుంటే తినరేంటి స్వామీ అంటుంది.
తనను తినిపించమంటాడు కానీ.. తనకు చేయి కాలడంతో తినిపించలేకపోతుంది. తనకు చేయి కాలిన విషయం ముందే గుర్తించిన రామా.. తనను ఆపి తన చేయిని తీసుకొని గాలి ఊదుతాడు. జానకి గారు.. అమ్మ కళ్ల ముందే ఉండాలనేది నా ఆశ. అందుకే నేను మీకు ఇలాంటి ఇబ్బందులు కలిగిస్తున్నందు నన్ను క్షమించండి అంటాడు రామా.
మా ఆయన వాళ్ల అమ్మ గారి కళ్ల ముందే ఉండాలనేది నా ఆకాంక్ష. చేయి కాలడం గురించి మీరేం బాధపడకండి. రేపటి నుంచి ఈ గుడ్డతో అవసరం లేకుండా డైరెక్ట్ గా చేతులతోనే పట్టుకొస్తాను అంటుంది జానకి. మీకోసం ఎంతో ఇష్టంగా జీడిపప్ప ఉప్మా చేశాను అంటుంది జానకి.
దీంతో తను తిని.. జానకిని తినిపిస్తాడు రామా. కట్ చేస్తే ఈరోజు నుంచి ఆ స్వీట్ కొట్టును నువ్వే చూసుకోవాలి అని అఖిల్ తో చెబుతుంది జ్ఞానాంబ. ఈ విషయం విన్న జానకి, రామా.. తన దగ్గరికి వచ్చి పై చదువులు చదివితే అఖిల్ భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని జ్ఞానాంబకు చెబుతుంది.
కానీ.. జ్ఞానాంబ వినదు. దయచేసి అఖిల్ చదువు మాన్పించకండి అన్నా కూడా వినదు. ఎవరు నువ్వు.. నా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
This website uses cookies.