Janaki Kalaganaledu : ఐపీఎస్ కలను ఎందుకు వదిలేసిందో జానకి రామాకు చెబుతుందా? జ్ఞానాంబ అసలు రూపం రామా తెలుసుకుంటాడా?

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 21 ఫిబ్రవరి 2022, ఎపిసోడ్ 241 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొత్తానికి వెన్నెల నిశ్చితార్థాన్ని ఎలాగోలా ఆపి వెన్నెల ప్రాణాలను కాపాడుతారు రామా, జానకి. అసలు.. నిశ్చితార్థాన్ని ఆపించిందే రామా, జానకి అనే విషయం జ్ఞానాంబకు తెలియదు. వెన్నెల నిశ్చితార్థం ఆగిపోవడంతో టెన్షన్ లో ఉంటుంది జ్ఞానాంబ. దీంతో తనకు తెలిసిన బంధువుల అబ్బాయి ఉన్నాడని.. తను వెన్నెలకు ఈడు జోడు కరెక్ట్ గా సరిపోతాడని జ్ఞానాంబతో చెబుతుంది జానకి. దీంతో సరే.. మీరిద్దరూ ఒకసారి వెళ్లి వాళ్లతో మాట్లాడండి అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో రామా, జానకి సంతోషిస్తారు. ఎలాగోలా వెన్నెల నిశ్చితార్థాన్ని ఆపాం కానీ.. అసలు సుబ్బరాజు వాళ్లు నింద వాళ్ల మీద ఎందుకు వేసుకున్నారు అని జానకితో అంటాడు రామా.

will janaki reveal the truth behind her abandonment of ips

అదే నాకు అర్థం కావడం లేదు అంటుంది జానకి. ఏది ఏమైనా.. మనం ఒకసారి వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లకు థ్యాంక్స్ చెప్పి రావాలి అంటుంది జానకి. మొత్తానికి ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అంటుంది జానకి. కానీ.. నేను లేను అంటాడు రామా. ఎందుకు ఏమైంది అంటే.. మళ్లీ తన చదువు విషయం గురించి ప్రస్తావిస్తాడు. మీకు ఎన్నిసార్లు చెప్పినా ఆ విషయాన్నే ఎందుకు పదే పదే తీసుకొస్తున్నారు అని అంటుంది జానకి. శ్రీవారు.. రేపు వాలెంటైన్స్ డే.. మనం ఈ పొట్లాడలు ఆపి కాస్త ప్రేమించుకోవడం మీద దృష్టి పెడదాం అంటుంది జానకి. మనదేమీ ప్రేమ పెళ్లి కాదు.. పెద్దలు కుదుర్చిన పెళ్లి అంటాడు రామా. ఏదైతేనేం.. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించుకోకూడదా అని అడుగుతుంది జానకి.

ఆ తర్వాత ఇద్దరూ నిద్రపోతారు. అర్ధరాత్రి నిద్రలేచిన రామా.. వైట్ అండ్ వైట్ వేసుకొని జానకిని నిద్రలేపుతాడు. దీంతో జానకి షాక్ అవుతుంది. ఏమైంది అని అడుగుతుంది. వైట్ డ్రెస్ లో రామాను చూసి షాక్ అవుతుంది. వెంటనే ఈ చీర కట్టుకొని రా అని చెబుతాడు. తెల్ల చీర కట్టుకొని జానకి రాగానే.. తన కళ్లు మూసి తనను ఒక ప్లేస్ కు తీసుకెళ్తాడు.

వాలెంటైన్స్ డే సందర్భంగా తన కోసం సపరేట్ గా డెకరేట్ చేయించి.. తమ ఫోటోలతో సెట్ చేయిస్తాడు. జానకి గారు ప్రతి ఫోటోలను మీరు చాలా సంతోషంగా ఉన్నారు అంటాడు. అవునండి.. ఈ సంతోషం, నవ్వు మీరిచ్చినవే. నవ్వడం మరిచిపోయిన నన్ను తిరిగి నవ్వేలా చేశారు అంటుంది జానకి.

Janaki Kalaganaledu : మీ చదువును నాకు వాలెంటైన్స్ డే బహుమతిగా ఇస్తారా అని జానకిని అడిగిన రామా

నా జీవితం ముగిసిపోయింది అని బాధపడుతున్న సమయంలో కొత్త జీవితాన్ని పరిచయం చేశారు అంటుంది జానకి. మరి.. ఈ ఫోటోలో ఎందుకు నవ్వట్లేదు అంటాడు రామా. దీంతో ఏంటా ఫోటో అని చూస్తుంది జానకి. చూస్తే అది వాళ్ల పెళ్లి నాటి ఫోటో.

ఆ ఫోటోను చూసి షాక్ అవుతుంది జానకి. పెళ్లి అనేది ప్రతి ఆడపిల్లకు ఒక అందమైన కళ. అలా పెళ్లి జరుగుతున్నప్పుడు కళకళలాడాల్సిన మీ మొహం ఎందుకు ఇలా దిగులుగా ఉంది అని అడుగుతాడు రామా. దానికి సమాధానం నేను చెబుతాను అంటాడు రామా.

ఇందుకు కూడా కారణం నేనే అంటాడు రామా. పెళ్లికూతురు ముస్తాబులో నీ మొహంలో సంతోషం దూరమై.. బాధ రావడానికి కారణం నేనే అంటాడు రామా. దీంతో అదేం కాదు రామా గారు. మీరసరు కారణం కాదు అంటుంది జానకి. ఐపీఎస్ అవ్వాలనేది మీ కల. ఆ కలను అందుకోకుండానే బలవంతంగా పెళ్లి చేస్తున్నారనేది బాధ. మీరు నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే మీకు ఇష్టమైన ఐపీఎస్ వైపు అడుగులు వేస్తూ ఉండేవారు జానకి గారు అంటాడు రామా.

మరి.. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదా.. మీకింత బాధ అంటాడు రామా. అయ్యో.. అదేం లేదు రామా గారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నందుకు నేను అణువంత కూడా బాధపడలేదు. నేను అలా బాధగా ఉండటానికి కారణం మీరు కానే కాదు అంటుంది జానకి.

మరేంటి కారణం అంటాడు రామా. చెప్పండి జానకి గారు అని అడుగుతాడు రామా. మీ బాధకు కారణం పెళ్లి కాదు అంటున్నారు. మరేంటి అని అడుగుతాడు. మీ ప్రాణానికి ప్రాణమైన ఐపీఎస్ కల.. మీ కళ్లముందు ఉన్న అగ్నిహోత్రంలో కాలి బూడిదవుతుందనా.. ప్రతి రోజు మీరు పైకి నవ్వుతూ కనిపిస్తున్నా.. అదే బాధ మీ మనసులో మోస్తున్నారు జానకి గారు.. అంటాడు రామా.

ఆరోజు మీ బాధకు కారణం నాకు తెలియదు. ఈరోజు తెలిసి కూడా నేను ఏమీ చేయలేకపోతే భర్తగా నాకు అంతకన్నా బాధ, అవమానం మరోటి ఉండదు జానకి గారు అంటాడు రామా. అందుకే ఈ ప్రేమికుల రోజు నేను మిమ్మల్ని ఒక బహుమతి అడుగుతున్నాను. మీ చదువును కొనసాగిస్తానని నాకు మాటివ్వండి అంటాడు రామా. మీ భర్తగా నన్ను గెలిపించండి అంటాడు రమా.

చెప్పండి జానకి గారు.. మీరు చదువును ఉన్నపళంగా వదిలేస్తున్నానని ఎందుకు అన్నారో చెప్పండి. ఇంకెప్పుడు అలా అననని.. ఎలాంటి ఆటకాంలు ఎదురైనా సరే.. ఐపీఎస్ అవుతానని నాకు మాటివ్వండి అని అడుగుతాడు రామా. మీ మాటతో ఈ ప్రేమికుల రోజు నాకు కూడా ఒక అందమైన జ్ఞాపకంగా అందించండి జానకి గారు అంటాడు  రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

34 minutes ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

2 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

3 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

4 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

5 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

6 hours ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

7 hours ago

Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం!

Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్‌ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…

8 hours ago