Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ 15 సోమవారం 2022, 711 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. విమానం ఎక్కిన తర్వాత ఫోటోలు తీసుకొని వాటిని దివ్యకు పంపిస్తుంది తులసి. సామ్రాట్, తులసి ఇద్దరూ పక్కపక్కన కూర్చొని సరదాగా గడుపుతుండటం చూసి నందు, లాస్య షాక్ అవుతారు. అస్సలు సహించరు. మరోవైపు ఆ ఫోటోలను చూసి దివ్య, అనసూయ, ప్రేమ్, అందరూ సంతోషిస్తారు. దివ్యకు కాల్ చేసి నేను ముందు సీటులో కూర్చొన్నాను అంటుంది. మొన్న బస్సు ఎక్కినప్పుడు ఏసీ చల్లగా ఉంది అనుకున్నాం కదా.. ఈ విమానంలో ఏసీ అయితే ఇంకా ఎక్కువగా ఉంది అంటుంది. దివ్యతో కూడా మాట్లాడుతుంది. నానమ్మ, తాతయ్యకు సమయానికి ట్యాబ్లెట్లు ఇవ్వు అని చెబుతుంది తులసి.
తర్వాత సామ్రాట్, తులసిని చూసి బత్తాయి బాలరాజు వాళ్లిద్దరూ భార్యాభర్తలు అని అనుకొని మీరిద్దరూ భార్యాభర్తలు కదా అంటాడు. హైదరాబాద్ బోర్ కొట్టి వైజాగ్ వెళ్తున్నారు కదా అంటాడు. అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు కదా అంటాడు బత్తాయి బాలరాజు. నువ్వు ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే బాగుండదు అంటూ నందు.. బత్తాయి బాలరాజుపై సీరియస్ అవుతాడు. కట్ చేస్తే అంకిత ఒంటరిగా కూర్చొని అభి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ప్రేమ్ వస్తాడు. మనసు మార్చుకొని వచ్చాను.. నీ కోసం వచ్చాను అని చెప్పినవాడు ఇప్పుడెందుకు ఇంతలా చిరాకు పడుతున్నాడు. ఆంటి మీద విరుచుకుపడుతున్నాడు అని అంటుంది అంకిత. దీంతో అది నీ మీద కోపం కాదు.. ఆస్తి రాకుండా చేసిందని అమ్మ మీద కోపం పెంచుకున్నాడు అంటాడు ప్రేమ్.
జరిగిన గొడవలు పక్కన పెట్టి ముందు నువ్వు శృతిని ఇంటికి తీసుకురా అంటుంది అంకిత. ఏదైనా కానీ.. నువ్వు శృతి విషయంలో ఇంకా లేట్ చేయకు అంటుంది అంకిత. నిన్ను కూడా నేను కోరుకునేది ఒకటే. శృతిదే తప్పు అనిపిస్తే క్షమించు. కాళ్లు, గడ్డం పట్టుకొని శృతిని ఇంటికి తీసుకురా. ఆంటి వైజాగ్ నుంచి ఇంటికి వచ్చే సరికి శృతి ఇంట్లో ఉండాలి.. అంటుంది అంకిత.
మరోవైపు విమానం టేకాఫ్ అవుతుంటే తులసి బయటికి చూసి సంతోషిస్తూ ఉంటుంది. కానీ.. సామ్రాట్ మాత్రం భయపడుతూ ఉంటాడు. కళ్లు మూసుకొని టెన్షన్ పడుతుంటాడు. సామ్రాట్ అలా ఉండటం చూసి తులసి నవ్వుతుంది. మరోవైపు విమానం కొంచెం దూరం ప్రయాణించాక విమానంలో టెక్నికల్ సమస్య రావడం వల్ల విమానం ల్యాండింగ్ లో సమస్య ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్మెంట్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
This website uses cookies.