Sai Pallavi : ఫిదా బ్యూటీ సాయి పల్లవికి మరో షాక్ తగలబోతుందా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే టాక్ నడుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలు చేయకపోయినా పర్ఫార్మెన్స్ పరంగానే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. కొన్ని సినిమాలకు హీరో ఉన్నా కూడా సాయి పల్లవి పేరు మీదే సినిమాను ప్రమోట్ చేసి మార్కెట్ వద్ద బజ్ క్రియేట్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే, ఎంత క్రేజ్ ఉన్నా కూడా సాయి పల్లవి ఖాతాలో హిట్స్ మాత్రం తక్కువే చేరుతున్నాయి. ఇటీవల వచ్చిన విరాట పర్వం సినిమా ఎన్ని అంచనాల మధ్య వచ్చిందో అందరికీ తెలిసిందే.
రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితా దాస్, నివేతా పేతురాజ్ లాంటి క్రేజీ స్టార్స్ ఉన్నా కూడా సినిమా మొత్తాన్ని కేవలం సాయి పల్లవి క్రేజ్‌తోనే ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు. కానీ, విరాట పర్వం సినిమా అనూహ్యంగా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. ఇంత దారుణంగా ఫ్లాపవుతుందని ఎవరూ ఊహించలేదు. స్క్రీన్ ప్లే కాస్త ఆసక్తికరంగా ఉన్నా విరాట పర్వం సినిమా మినిమం హిట్ గా నిలిచేది. కానీ, సాయి పల్లవి ఇమేజ్ కూడా సినిమాను నిలబెట్టలేకపోయింది. దాంతో కొంత నెగిటివిటీకి గురైంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చెసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి అనవసరంగా ట్రోల్స్ ఎదురుకుంది. అయితే, ఇప్పుడు సాయి పల్లవి నటించిన మరో సినిమా రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా విడుదలకు పెద్ద సమయం లేదు. అయినా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు తమిళ స్టార్ హీరో సూర్య – జ్యోతిక రెడీ అవుతున్నారు. సాయి పల్లవి ప్రధాన పాత్రలో ‘గార్గి’ అనే సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషలలో రిలీజ్ కాబోతోంది. ఇదే నెలలో సినిమాను 14వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల మొత్తం వరుసగా సినిమాలు ఉన్నాయి. పోనీ ఆ తర్వాత రిలీజ్ చేద్దామంటే అన్నీ పెద్ద సినిమాలున్నాయి. ఇప్పుడేమో అసలు ప్రమోషన్స్‌కు సమయం లేదు. ఎంత సాయి పల్లవి – సూర్య ఇమేజ్‌లపై ఆధారపడి సినిమాను రిలీజ్ చేసిన 10 రోజుల్లో సినిమాపై అంచనాలు పెంచడం చాలా కష్టం. తేడా కొడితే గ్యారెంటీగా మరో షాక్ తప్పదేమో.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.