
pavitra husband stunning comments on his wife
Pavitra : సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ గత కొద్దిరోజుల నుంచి జోరుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వారిద్దరూ కలిసి ఉన్న హోటల్ వద్దకు వెళ్లి వారి మీద దాడి చేయటానికి ప్రయత్నించడం సంచలనంగా మారింది. అయితే నరేష్ మూడో భార్యతో పాటు పవిత్రా లోకేష్ మాజీ భర్త సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తనకు వివాహం జరగలేదని సుచేంద్ర ప్రసాద్ తో కూడా సహజీవనమే చేశానని పవిత్రా లోకేష్ పేర్కొన్నట్టు ప్రచారం జరగగా తాజాగా ఆమె తన భార్య అంటూ సుచేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
అసలు నరేష్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని తాజాగా కన్నడ మీడియాతో ఆయన పేర్కొన్నట్టు సమాచారం. తన భార్యతో సంబంధాలపై మీడియా, కొంతమంది స్నేహితుల ద్వారా తెలుసుకున్నానని సుచేంద్ర ప్రసాద్ లోకల్ మీడియాతో మాట్లాడారు అని తెలుస్తోంది. ”నా భార్యపై వస్తున్న వార్తలని మీడియా, కొంతమంది స్నేహితుల ద్వారా ఇటీవలే తెలుసుకున్నాను. పవిత్ర మేము సహజీవనం చేస్తున్నామని చెప్పిందట. కానీ మేము ఇద్దరం 16 ఏళ్ల క్రితమే హిందూ వివాహచట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నాం. అందుకు ఆధారాలు కూడా వున్నాయి. మా పాస్‌పోర్టు, ఆధార్‌కార్డులో కూడా భార్య భర్తలుగా మా పేర్లు ఉంటాయి.
pavitra husband stunning comments on his wife
మా ప్రేమకు, దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నేను పవిత్రని ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర కామెంట్స్ చేయలేదు. పవిత్రపై ఇప్పటికీ నాకు గౌరవం ఉంది. ఈ వ్యవహారాల వెనుక ఎవరో ఉన్నారు. నాకు నరేశ్ ఎవరో కూడా తెలీదు” అని అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై నరేశ్ కానీ, పవిత్రా కానీ స్పందిస్తారేమో చూడాలి. గత వారంరోజులుగా పవిత్రా లోకేష్, నరేశ్.. ఇద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వారాలు వచ్చాయి. మొదట వీరిద్దరూ ఖండించినా తాజాగా ఆదివారం ఉదయం మైసూరులోని ఓ హోటల్ లో వీరిద్దరూ కనిపించారు. అక్కడికి నరేశ్ మూడో భార్య వెళ్లి పవిత్రని చెప్పుతో కొట్టబోయింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.