
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 9 జనవరి 2023, ఎపిసోడ్ 837 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు, లాస్య దగ్గరికి వెళ్లి బెనర్జీతో చేతులు కలపొద్దు అంటుంది. అతడితో చేతులు కలపడం తప్పుడు నిర్ణయం అవుతుంది అని చెబుతుంది తులసి. కానీ.. నీతో పెళ్లి జరగడమే అతి పెద్ద తప్పు. అందరి ముందు నన్ను ఫూల్ ను చేయడానికే కదా నిన్న సరుకులు పట్టుకొని వచ్చి ఇచ్చావు. నువ్వు ఒక తియ్యటి విషానివి. నవ్వుతూనే కాటేస్తావు. నా మీద జాలి చూపిస్తున్నట్టే చూపిస్తూ వెన్నుపోటు పొడుస్తున్నావు. నిన్ను ఇక నమ్మేది లేదు. నువ్వు వచ్చిన పని అయిపోయింది. నేను బ్యాలెన్స్ తప్పకముందే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు నందు. దీంతో ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.
అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన తులసి.. కూర్చొని నేనేం తప్పు చేశా అని అనుకుంటుంది. అందరూ నా మీదే పడి ఏడుస్తున్నారు. నేను చెప్పేది మాత్రం వినడం లేదు అనుకొని బాధపడుతుంది. కొన్ని మంచినీళ్లు తాగుతుంది తులసి. ఆ తర్వాత తనకు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతుంది. ఫోన్ తీసుకొని ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా తనకు అస్సలు కుదరదు. చివరకు ఎలాగోలా.. ఫోన్ తీసుకొని ప్రేమ్ కు కాల్ చేస్తుంది. కానీ.. క్యారమ్ ఆడుతూ అందరూ తమ ఫోన్లను సైలెంట్ లో పెడతారు. దీంతో ప్రేమ్ కు ఫోన్ వినబడదు. ఆ తర్వాత అభికి చేస్తుంది తులసి. కానీ.. అభి ఫోన్ కూడా సైలెంట్ లో ఉంటుంది. దీంతో అభి కూడా ఎత్తడు.
వెంటనే సామ్రాట్ కు కాల్ చేస్తుంది కానీ మాట్లాడలేకపోతుంది. దీంతో తిరిగి మళ్లీ తులసికి ఫోన్ చేస్తాడు సామ్రాట్. కానీ.. తులసి లిఫ్ట్ చేయలేకపోతుంది. దీంతో ఏం జరిగిందో అని వెంటనే తులసి ఇంటికి వస్తాడు సామ్రాట్. కానీ డోర్ తీసి ఉండదు. డోర్ లాక్ చేసి ఉండటంతో డోర్ కొడతాడు. కానీ.. ఉలుకు, పలుకు ఉండదు.
దీంతో ఏం జరిగిందో అని ఫోన్ చేస్తాడు. ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతూ ఉంటుంది. దీంతో కిటికీలో నుంచి చూడగానే తులసి కింద పడిపోయి ఉంటుంది. వెంటనే డోర్ బద్దలు కొట్టి తనను తీసుకెళ్లి ఆసుపత్రిలో చేరుస్తాడు సామ్రాట్. డాక్టర్ వెళ్లి ట్రీట్ మెంట్ స్టార్ట్ చేస్తారు.
ఆమె హెల్త్ బ్యాడ్ కండీషన్ లో ఉందని చెబుతుంది డాక్టర్. బీపీ, పల్స్ పడిపోయిందని.. మేజర్ ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయాలని చెబుతారు డాక్టర్లు. వెంటనే ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయాలి. వెంటనే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి అంటుంది. దీంతో ట్రీట్ మెంట్ స్టార్ట్ చేసేముందు.. కన్సెంట్ ఫామ్ మీద పేషెంట్ గార్డియన్ సైన్ చేయాలి అని చెబుతుంది నర్స్.
పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ ఉందని డాక్టర్ చెప్పారు కదా. లేట్ అయితే చాలా కష్టం సార్. వెంటనే సైన్ చేయండి అంటుంది నర్సు. దీంతో సామ్రాట్ కు ఏం చేయాలో అర్థం కాదు. సామ్రాట్ ఇంకా సైన్ చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ నేను తన భర్తను కాదు అంటే.. తన వాళ్లు వచ్చేదాకా ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయరు అని చెప్పి తన డిటెయిల్స్ ఫిల్ చేస్తాడు సామ్రాట్.
ఆ తర్వాత ట్రీట్ మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇంతలో తులసి నెంబర్ కు తన తమ్ముడు దీపక్ ఫోన్ చేయడంతో వాళ్లకు ఈ విషయం చెబుతాడు సామ్రాట్. ఆ తర్వాత అందరికీ ఈ విషయం తెలిసి అక్కడికి వస్తారు. తనకు పెరాలిసిస్ కానీ.. కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ చెబుతుంది. తనకు పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఏం చేయాలో అర్థం కాదు వాళ్లకు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.