Mega Heroes : అల్లు అర్జున్ నంద్యాల వెళ్లివచ్చినప్పటి నుంచి అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య ఫైట్ తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఈ ఫ్యాన్ వార్ ఒక రేంజ్ లో జరుగుతుంది. ఐతే ఫ్యాన్స్ మాత్రమే కాదు అల్లు అర్జున్ ని ఇన్ డైరెక్ట్ గా మెగా హీరోలు కూడా టార్గెట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఆమధ్య సాయి తేజ్ కూడా బన్నీని సోషల్ మీడియా నుంచి అన్ ఫాలో చేయడమే కాకుండా అల్లు అర్జున్ గురించి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడాడు. ఇక ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వంతు వచ్చింది. లేటెస్ట్ గా మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఎవరైనా సరే ఎంతటివారైనా ఎవరి వల్ల ఎదిగామో వళ్లని మర్చిపోకూడదు.. అలా మర్చిపోతే ఎన్ని గొప్ప విజయాలు వచ్చినా వ్యర్ధమే అన్నట్టుగ వరుణ్ తేజ్ స్పీచ్ ఇచ్చాడు. ఇందులో అర్ధం పరమార్ధం తాత్పర్యం అన్ని చూస్తే ఇవన్నీ అల్లు అర్జున్ ని దృష్టిలో ఉంచుకుని వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ లానే ఉన్నాయి.
ఎందుకంటే వరుణ్ తేజ్ ఇంకా హిట్లు ఫ్లాపుల మధ్య స్ట్రగులింగ్ లోనే ఉన్నాడు. గద్దలకొండ గణేష్ తర్వాత ఒక్క హిట్టు పడలేదు. అలాంటిది ఇది తన గురించి కాదు తను ఎవరికో చెప్పిన సందేషమే అన్నట్టుగా ఈ కామెంట్స్ ని తీసుకుంటున్నారు. అసలే సోషల్ మీడియాలో అల్లు ఆర్మీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ ఇంకా పవర్ స్టార్ ఫ్యాన్స్ కొట్లాట ఎక్కువవుతుంది అనుకుంటుంటే మళ్లీ అగ్నికి గాలి తోడైనట్టు వరుణ్ తేజ్ మాటలు మరింత రెచ్చగొడుతున్నాయి.
ఐతే తాను మాత్రం ఎంత ఎత్తు ఎదిగినా పెదనాన్న, బాబాయ్ అన్నయ్య లను ప్రతి వేదిక మీద గుర్తు చేసుకుంటానని.. ఎవరు ఎన్ని అనుకున్నా ఇంట్లో వాళ్ల పేర్లు చెబుతావేంటని అన్నా సరే తన పద్ధతి మారదని చెప్పాడు వరుణ్ తేజ్.
Lagcherla : ఫార్మా సిటీ ప్రాజెక్టుకు సంబంధించి ఈ నెల 11న విచారణ సందర్భంగా వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలం…
Prabhas Raja Saab : స్టార్ సినిమాను మొదలు పెట్టడం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం చాలా సులువే కానీ…
Carrot Juice : చలికాలం రానే వచ్చేసింది. ఈ కాలంలో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే మార్కెట్లో ఎటు…
Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసం లో చాలామంది…
GAIL Recruitment : గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత…
Jupiter : వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ…
AUS vs IND : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024-25 భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య…
BSNL : బీఎస్ఎన్ఎల్ నేషనల్ Wi-Fi రోమింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. BSNL యొక్క నేషనల్ వై-ఫై రోమింగ్ సర్వీస్ ఇప్పుడు…
This website uses cookies.