YouTube : యూట్యూబ్ షాకింగ్ న్యూస్‌.. ఇక ఆ ఛాన‌ళ్ల‌పై నిషేధం..!

YouTube: డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలకి గత కొన్నేళ్లుగా జనాలలో ఆదరణ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఇంట్లో ఉన్న టీవీ ముందు కూర్చుంటే గానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసేది. ఇప్పుడు చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచం మొత్తం మన చేతిలో ఉంటోంది. ప్రపంచ నలుమూలలా ఎక్కడ ఏం జరుగుతున్నాక్షణాలలో తెలుసుకోవచ్చు. అయితే ఏదైనా పెరుగుట విరుగుట కొరకే అనే సామేత మాదిరిగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియాల వల్ల ఎన్ని లాభాలున్నాయో.. అంతకు మించిన తీవ్ర నష్టాలు కూడా ఉన్నాయి.

జన నష్టంతో పాటూ ఆర్ధిక లావాదేవీల వలన ఊహించని పరిణామాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒక వార్త వస్తే ఒకప్పుడు అందరూ అదే నిజం అని నమ్మేవారు. ఇప్పుడు ఆరోజులు పోయాయి. వచ్చిన వార్త నిజమా కాదా అని తెలుసుకోవడానికి అన్నీ రకాల ఎంక్వైరీలు చేయాల్స్ది వస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పడు అసలు వార్తలకంటే రూమర్సే ఎక్కువయ్యాయి. సినీ, రాజకీయ నాయకులకి సంబంధించిన విషయాల దగ్గర్నుంచి ఇన్నాళ్లు విళయ తాండవం ఆడిన కరోనా వేవ్స్ వరకు నిజాల
కంటే గాసిప్సే ఎక్కువ శాతం వచ్చి అందరినీ భయాందోళనకి గురి చేశాయి.

youtube key decision

యూట్యూబ్​ ఛానెళ్లు తప్పుడు వార్తలు

మరీ ప్రధానంగా.. కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine)​ విషయంలో ఇంతకముందు ఎప్పుడూ లేని విధంగా ఫేక్​ న్యూస్​ ప్రచారం చేశారు. కోవిడ్​–19 వ్యాక్సిన్​ తీసుకుంటే ప్రాణహాని ఉందంటూ కొన్ని యూట్యూబ్​ ఛానెళ్లు తప్పుడు వార్తలు, విశ్లేషణలు ప్రసారం చేస్తు వస్తున్నాయి. ఈ ఫేక్ న్యూస్ నిజమే అని నమ్మిన చాలామంది ప్రజలు వ్యాక్సిన్​ వేయించుకోవడానికి ముందుకు రాలేకపోతున్నారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్ఠికి వెళ్ళింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలందరికీ రెండు డోసులు పూర్తి చేయాలని పెట్టుకున్న వ్యాక్సిన్ టార్గెట్ చేరుకోవడం కష్టతరంగా మారింది. ఈ విషయాన్నే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) జులైలో మీడియాతో చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తప్పుడు  మాచారాన్ని ప్రచారం చేయడం వల్ల టీకా తీసుకునే విషయంలో ప్రజలకు అనేక సందేహాలు కలుగుతునాయని, అటువంటి ఛానళ్లను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

youtube key decision

ఈ నేపథ్యంలో ఇలా ఫేక్​ వార్తల భ్రమలో పడుతూ కరోనా విజృంభనలో బాగస్వామ్యం కావొద్దని ప్రజలను కోరారు. ఇదిలా ఉంటే గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ (YouTube Latest Telugu News) కూడా ఇటీవల కరోనా వాక్సిన్​పై ఫేక్​ న్యూస్​ ప్రచారం చేస్తున్న పలు​ ఛానెళ్లపై నిషేధం విధించింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు దాదాపు 130,000 ఫేక్ వీడియోలను తొలగించింది. ఈ మేరకు యూట్యూబ్​ వైస్​ ప్రెసిడెంట్​ ఆఫ్​ గ్లోబల్​ ట్రస్ట్​ సేఫ్టీ అధికారి మాట్​ హాల్​ ప్రిన్ ధృవీకరించారు. ఇక ప్రముఖ అల్ఫాబెట్ అమెరికన్​ మల్టీ నేషనల్​ టెక్నాలజీకి సంబంధించిన ఆన్​లైన్​ వీడియో ప్లాట్​ఫామ్​ కోవిడ్​ వ్యాక్సిన్​లకు వేరే విధంగా తప్పుడు సమాచారం అందిస్తున్న ఉద్యోగులను కూడా ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించినట్టు తెలిపారు.

youtube key decision

అలాగే కోవిడ్​ వ్యాక్సిన్​లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిలో రాబర్ట్​ ఎఫ్​.కెన్నడీ, జోసెఫ్​ మెర్కోలా వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఫేమస్ సోషల్​మీడియా వెబ్ సైట్స్ అయిన యూట్యూబ్​, ఫేస్​బుక్​, ట్విట్టర్​ లాంటి వాటిలో ఫేక్ వీడియోలకు సపోర్ట్ చేస్తున్నారు గానీ, వాటిని అడ్డుకోవడం లేదంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయాలను తెలుపుతున్నారు. దాంతో ఈ ఫేక్​ న్యూస్​ ప్రచారం చేస్తున్న ఛానెళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంది యూట్యూబ్​. ఇప్పటి నుంచి, యూట్యూబ్​ తరహాలోనే ఫేస్​బుక్​, ట్విట్టర్​
కూడా టీకాల గురించి తప్పుడు సమాచారాన్ని చేరవేస్తే మాత్రం వినియోగదారులను ప్లాట్‌ఫారమ్ నుండి నిషేధించనున్నట్టు వెల్లడించాయి.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago