Hyper Aadi : సినిమా లేదా టీవీ ఇండస్ట్రీలో ఉన్న వారు రాజకీయాల్లో అడుగు పెడితే ఎలా ఉంటుందో ఇప్పడు హైపర్ ఆదికి అర్థం అయ్యింది. మొన్న జనసేనకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సభలో హైపర్ ఆది పాల్గొన్నాడు. అప్పటి నుండి కూడా ఆదిని వైకాపా వారు చీల్చి చెండాడుతున్నారు. బాబోయ్ మీకు ఒక దండంరా బాబు అన్నట్లుగా ఆది బతిమిలాడుకునే విధంగా ఆ పార్టీ వారు నానా రచ్చ చేస్తున్నారు అంటూ హైపర్ ఆదితో సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే అర్థం అవుతుంది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న ఆదికి పవన్ కళ్యాణ్ అంటే అమితమైన అభిమానం.
ఆ అభిమానంతోనే గత కొంత కాలంగా జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. దాంతో వైకాపా వారు ఆదిని సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ట్రోల్స్ చేస్తూ గతంలో ఆది చేసిన తప్పులను ఇప్పుడు ఎత్తి చూపుతూ ఆయన స్కిట్స్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. ఆ మధ్య టిక్ టాక్ లాఫింగ్ స్టార్ ను ఆది తన స్కిట్ లో తీసుకు వచ్చాడు. లాఫింగ్ స్టార్ తో పాటు మరి కొందరు కూడా ఆది స్కిట్ లో కనిపించారు. ఆ లాఫింగ్ స్టార్ స్కిట్ లో కనిపించినందుకు కనీసం పారితోషికం ఇవ్వక పోగా క్యాబ్ ను కూడా సొంతం గా తామే బుక్ చేసుకుని ఇంటికి వెళ్లాల్సి వచ్చిందట.
ఈ విషయాన్ని లాఫింగ్ స్టార్ ఒక వీడియోను చేసి షేర్ చేశాడు. మేము ఇంటికి వెళ్లడానికి కనీసం క్యాబ్ కు డబ్బులు ఇవ్వలేదు.. పోయిన తర్వాత ఎలా చేరారు.. అసలు చేరారా లేదా అని కూడా అడగలేదు కానీ నీకు రాజకీయాలు అవసరమా.. నీవు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావా ఆది అంటూ లాఫింగ్ స్టార్ చేసిన వ్యాఖ్యలను వైకాపా వారు తెగ షేర్ చేస్తున్నారు. హైపర్ ఆది మరీ ఇంత నీచుడు అంటూ వైకాపా వారు లాఫింగ్ స్టార్ యొక్క వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఆదిని ఓ రేంజ్ లో వైకాపా వారు ఆడేసుకుంటున్నారు. మరి ఆది ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.