
RP Patnaik Clashes with Teja In Avunanna Kadanna
డైరెక్టర్ తేజ, ఆర్పీ పట్నాయక్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరూ ‘చిత్రం’ సినిమాతో బాగా ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి దాదాపు ఈ ఇద్దరూ కలిసి దశాబ్దానికి పైగా పని చేసినట్టున్నారు. ఈ కాంబోలో నువ్వు నేను, జయం వంటి బ్లాక్ బస్టర్లెన్నో వచ్చాయి. అయితే ఈ ఇద్దరి మధ్య కూడా విబేధాలు గొడవలు జరిగాయి. అందులో ఓ సంఘటన గురించి ఆర్పీ పట్నాయక్ చెప్పాడు. దర్శకుడు తేజ అన్న మాటలకు ఆర్పీ పట్నాయక్ బాధపడ్డాడట.
RP Patnaik Clashes with Teja In Avunanna Kadanna
ఔనన్నా కాదన్న సినిమా రెమ్యూనరేషన్ విషయంలో ఆర్పీ పట్నాయక్‌కు అన్యాయం జరిగిందట. తాను ముందుగా రెమ్యూనరేషన్ అడగనని, అయినా ఇంత ఇవ్వమని అంత ఇవ్వమని ఎప్పుడూ ఎవరినీ అడగలేదని ఆర్పీ పట్నాయక్ చెప్పుకొచ్చాడు. అయితే ఆర్పీ పట్నాయక్ తేజ మధ్యన ఔనన్నా కాదన్న సినిమా రెమ్యూనరేషన్ విషయంలో గొడవ జరిగిందట. అన్ని సినిమాలకు ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే ఔనన్నా కాదన్న సినిమాకు తక్కువగా ఇచ్చారట.
తాను మూమూలుగా తీసుకునే రెమ్యూనరేషన్ కంటే చాలా తక్కువగా ఇచ్చారని తెలిపాడు. ఆ సమయంలో తనకు కూడా ఎలాంటి ఆఫర్స్ లేవు.. కొన్ని అవసరాలు కూడా వచ్చి పడ్డాయని అన్నాడు. అయితే నిర్మాత రెమ్యూనరేషన్ తక్కువ ఇచ్చాడని తేజకు చెబితే.. నీ స్థాయి ఏంటో చూసుకో అన్నాడు. ఆ మాటకు చాలా బాధపడ్డాను. అయితే ఆ తరువాత కూడా తేజతో మాట్లాడుకున్నాం.. టచ్‌లోనే ఉన్నాం. కానీ ఆ మాటకు మాత్రం కాస్త బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.